Take a fresh look at your lifestyle.

హెల్త్ ‌సిటీగా రూపుదిద్దుకోనున్న ఓరుగల్లు

మల్టీ సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణానికి జీవో జారీ
15 ఎకరాల్లో 1,100 కోట్లతో నిర్మాణాలకు అనుమతి మంజూరు
24 ఫ్లోర్లతో బారీ భనవ సముదాయం, 2,000 పడకలు
సూపర్‌ ‌స్పెషాలిటీల కోసం 800 పడకలు

వరంగల్‌ ‌ను హెల్త్ ‌సిటీగా తీర్చిదిద్దాలని వైద్య ఆరోగ్య శాఖ సన్నహాలు చేస్తోంది. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో తేవాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఈ జిల్లాలో కాళోజీ నారాయణ రావు హెల్త్ ‌యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో వరంగల్‌ ‌జిల్లా మల్టీ సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణానికి సంబంధించి జీవో ఎం.ఎస్‌ ‌నెంబర్‌.158 ‌ను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది..పేదలకు కార్పొరేట్‌ ‌స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో వరంగల్‌ ‌లో ప్రభుత్వం మల్టీ సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మించాలని నిర్ణయించినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్‌ ‌స్పెషాలిటీ సేవలతో కూడిన ఈ హెల్త్ ‌సిటీ నిర్మాణాన్ని ప్రభుత్వం మొత్తం 215.35 ఎకరాల్లో నిర్మాణం జరగనుంది. అందులో 15 ఎకరాల్లో 1,100 కోట్లతో నిర్మాణాలకు అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. 24 ఫ్లోర్లతో బారీ భనవ సముదాయంతో మొత్తం 2,000 పడకల సామర్థ్యం తో ఈ హాస్పిటల్‌ ‌నిర్మాణం జరగనున్నది. స్పెషాలిటీ వైద్యం కోసం 1,200 పడకలు.

ఇందులో జనరల్‌ ‌మెడిసిన్‌, ‌జనరల్‌ ‌సర్జరీ, %జుచీ•%, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ ‌మొదలైనవి ఉంటాయి. సూపర్‌ ‌స్పెషాలిటీల కోసం 800 పడకలు వీటిలో ఆంకాలజి సహా..న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్‌ ‌సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్‌, ‌యూరాలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాలు ఉంటాయి. కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. కీమోథెరపీ మరియు రేడియేషన్‌ ‌సౌకర్యాలతో అత్యాధునిక క్యాన్సర్‌ ‌కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. డెంటల్‌ ‌కళాశాలను ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనున్నారు. హెల్త్ ‌సిటీ లో వైద్య విద్య కొరకు వైద్య కళాశాల, డెంటల్‌ ‌కళాశాలలు, వైద్య విద్య కొరకు ప్రత్యేక ఆరోగ్య విశ్వ విద్యాలయం ( కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం), వైద్య సేవలకొరకు 2000 పడకల మల్టీ సూపర్‌ ‌స్పెషలిటీ హాస్పిటల్‌ ‌దీనిలో సాధారణ సేవలైన మెడిసిన్‌, ‌సర్జరీ ల తో పాటు సూపర్‌ ‌స్పెషలిటీ సేవలైన గుండె , కిడ్నీ , కాన్సర్‌ ‌సేవలు ,డాక్టర్స్ , ‌వైద్య విద్యార్థులు , వైద్య సిబ్బంది కొరకు వసతి కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply