Take a fresh look at your lifestyle.

పో…వెనక్కి

ఓరి చైనావాడ
ప్రపంచమంత
అంతుపట్టని రోగంతో
ప్రాణాలరచేతిలో పట్టుకుని
గాలిలో దీపాలై రోదిస్తుంటే
ఎప్పుడేమి జరుగుతుందోనని
భయం భయంగా
బతుకెల్లదీస్తుంటే

ప్లాస్టిక్‌ ‌బుద్దోడా
నీకేం రోగంరా
కొరోనాకు కారణం నీవేనని
అందరు నిన్ను దూరంపెడుతున్నరు

దృష్టి మరల్చడానికా
మా దేశంపై దాడి..?

ఎర్రముసుగేసుకుని
సామ్రాజ్యవాద
దురుద్దేశంతో
నీ అడుగులు పడుతున్నయ్‌
‌ప్రపంచం పసిగడుతోంది
కళ్లు మూసుకుని పిల్లిపాలుదాగినట్టు
తస్మాత్‌ ‌జాగ్రత్త

నీవు తయారు చేసే
వస్తువులకు మాత్రమే
మేం బానిసలం
నీకు కాదు

ఓ వైరస్లోడ
ఇకనుంచైనా
ఎవరికేమైనా
కారణం నీవై
నిలుస్తావు
కాలగర్భంలో
కలిసిపోతావు

పొ…వెనక్కిపో
యుద్ధంలో నీవెవరిని
జయించలేవు

నీ వాలకంచూస్తే
నువ్వు కూసున్న
కొమ్మను(భూమి)
నువ్వే నరుకుంటున్నావ్‌
‌కట్టిపెట్టు నీ నాటకాలు
ఎవ్వడేమి తీసుకుపోడిక్కడ
మట్టిలో కలిసిపోవాల్సిందే.

– సి.శేఖర్‌ (‌సియస్సార్‌), ‌సీనియర్‌ ‌తెలుగు ఉపాధ్యాయులు,పాలమూరు, 9010480557

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply