హెచ్‌ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు
విఆర్‌ఎల రేగులరైజ్ .. రెండో విడత గొర్రెల పంపిణీ
వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు
మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటీ కి స్థానం
టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ
మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం
ఉమామహేశ్వర లిప్ట్ ఇరిగేషన్ స్కిమ్ పేజ్ 1, 2 కేబినెట్ నిర్ణయం
హుస్సేన్ సాగర్‌కు కూడా గోదావరి జలాలు
సిఎం కెసిఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన కేబినేట్
వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు
జీ ఓ 111 గ్రామాలకు వర్తింపు చేస్తూ నిర్ణయించారు. అలాగే తలంగాణలో 38 డీఎంహెచ్ వో పోస్టులు మంజూరు చేశారు. కొత్తగా 40 మండలాల్లో పీహెచ్ సీలు మంజూరు చేశారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పర్మినెంట్ ఉద్యోగులను పెట్టాలని నిర్ణయించారు. జైన్ కమ్యూనిటీని మైనార్టీ కమిషన్ పరిధిలోకి తీసుకురావటం. ఆ వర్గానికి చెందినవారికి సభ్యుడిగా అవకాశం ..మొత్తం కమిషన్ లో 9 మంది సభ్యులుగా నిర్ణయించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలోపేతం చేస్తూ కొత్తగా 10 పోస్టులు మంజూరుకు ఆమోదం ఇచ్చారు. వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉమామహేశ్వర లిప్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2ల ప్రాజెక్టు పనులకు ఆమోదం లభించింది. గొర్రెల పథకానికి సంబంధించి మరో 15 రోజుల్లో రెండవ విడత గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వనపర్తిలో జర్నలిస్టు భవనానికి పది గుంటల భూమిని మంజూరు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసకకుంది. ఖమ్మంలో జర్నలిస్టుల ఇండ్ల కోసం 23 ఎకరాల భూమిని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే రాష్ట్రంలో మక్కలు, జొన్నల కొనుగోలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తండాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ను మంజూరు చేస్తూ నిర్ణయించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వమించాలని నిర్ణయించారు. .ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం ఉండేలా కార్యాక్రమాలను చేపట్టబోతున్నారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిని మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. ఈ సబ్ కమిటీ విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ప్రోత్సాహకాలు అందించేలా విధివిధానాలు ఖరారు చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం ఆదేశించారు. ఈ సబ్ కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పథకం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాబోయే రోజుల్లో కొడపోచమ్మ సాగర్ లో ఉన్న కాళేశ్వరం జలాలతో మూసీ, గండిపేట్, హిమాయత్ సాగర్ ను లింక్ చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. స్వచ్ఛమైన మూసీగా మార్చడం సహా గండిపేట, హిమాయత్ సాగర్‌ను నిండు కుండలా మార్చాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాక, హుస్సేన్ సాగర్‌ను కూడా గోదావరి జలాలతో లింక్ చేయాలని, అందుకు డిజైన్లను రూపకల్పన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
నకిలీ విత్తనాల ద ఉక్కుపాదం మోపాలని కేబినెట్ నిర్ణయించింది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పీడి యాక్ట్ పెట్టాలని కేబినెట్ ఆదేశం ఇచ్చింది.