
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల రెండోరోజు గురువారం నాడు బలాలయములో స్వామివారి కల్యాణమహోత్సవానికి ముక్కోటి దేవతలను గరుత్మతుండు ఆహ్వానించే ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వాన ఘట్టలను యాజ్ఞీక, అర్చక బృందం పాంఛరాత్రగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి ముక్కోటి దేవతలను, సుర మునులను ఆహ్వానించే బాధ్యతను గరుత్మండికి అప్పగిస్తు ఆలయంలో ధ్వజారోహణం నిర్వహించారు. గరుడుడి చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని నవధాన్యాలతో ధాన్యాధివాసం, ఛాయదివాసం, జలాధివాసం, చుట్టు నవకళశలతో యాజ్ఞీకులు, వేద పండితులు, అర్చకలు వేదమంత్రాలు, మంగళవాయిధ్యాలతో, సన్నాయిరాగాలతో అష్టదిక్పాలకులను ఆహ్వానించి ఆయా మంత్రాలతో పూజలు స్త్రోతాలు నిర్వహించారు.
అనంతరం ధ్వజపటాన్ని ధ్వజస్తంభానికి కట్టి చుట్ట బ్రహ్మ అష్టదిక్పాలకులను అహ్వానం చేసి రాగతాళాలతో మంత్రాలతో పూజించి బలిహరణం గరుడుముద్దలను నివేదన చేసి పైకి ఎగురవేసి గరుత్మంతునికి షోడషపోపచారాలతోపూజలు జరిపి జీరకర్ర బెల్లంపెట్టి మంగళాష్టకాలు చూర్ణిక చదువుతు గరుత్మంతునికి ఆహ్వానం పలికారు. పైకి ఎగురవేసిన గరుడ ముద్దలను భక్తులకు పంచగా గరుడ ముద్దలు స్వీకరించిన వారికి సంతానం కలుగుతుందన్న, కోరికలు తీరుతాయని బాధలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయన్న నమ్మకంతో వాటి కోసం భక్తులు పోటీ పడ్డారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో యాజ్ఞీకులు వేద పండితులు వేద మంత్రాలతో శాస్తయ్రుక్తంగా భేరీ పూజ, దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో యాజ్ఞీకులు, ఆలయ ప్రధానార్చకులు పర్యవేక్షణలో సాగగా ఈవో గీత, ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ పర్యవేక్షకులు వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.