Take a fresh look at your lifestyle.

సిరి ధాన్యాలతో ‘‘ఆరోగ్య సిరి’’

కొరోనా థర్డ్ ‌వేవ్‌ ‌ప్రపంచం ముందు పొంచి ఉన్న నేపథ్యంలో, ఇప్పటికే చైనా, రష్యా,యూఎస్‌, ‌యూకే ల్లాంటి అభివృద్ధి చెందిన దేశాలనే అతలాకుతలం చేస్తున్న సందర్భంలో మన ఆహారపు అలవాట్లు,జీవనశైలిలను తదనుగుణంగా మార్చుకోవాల్సిన అత్యవసరం మనందరిపైన ఉంది. కరోనా ఫస్ట్ అం‌డ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌లలో మనకందరికీ సుపరిచితమైన పదం ‘‘ఇమ్యూనిటీ పవర్‌’’(‌రోగ నిరోధక శక్తి). దీన్ని సాధారణంగా మనం తినే ఆహారంలోని పోషకాల ద్వారా పెంపొందించుకోవచ్చు. మన ప్రాచీన, సంప్రదాయపు ఆహారపు అలవాట్లయిన చిరు ధాన్యాల(మిల్లెట్స్)‌ను ఆహారంలో తీసుకోవడం ఎప్పుడైతే మనం మరిచిపోయి, మారిన ఆహారపు అలవాట్లయిన ఫిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ‌ఫుడ్‌, ‌ఫప్స్ ‌వంటి పోషకాలనేవి అసలే లేని తిండిని అలవాటు చేసుకొని,  చిన్న చిన్న జబ్బులను సైతం తట్టుకునే శక్తి మన శరీరాలకు లేకుండా ప్రతీ చిన్న అనారోగ్య సమస్యలకు ఔషదాలపై ఆధారపడి బ్రతుకెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది.The father of Medicine గా మనం పిలుచుకునే హిపోక్రటస్‌’Let food be thy medicine and medicine be thy food” అన్నట్లుగా ఆహారానన్నే ఔషధంగా తీసుకోవాలన్న మాట అక్షర సత్యం. సాధారణంగా నలబై యేండ్లు దాటిన వారికి ‘షుగర్‌’ అనే చేదు పదం అందరినీ వేధిస్తున్న మాట వాస్తవమే! తమతో పాటు ప్రయాణంలో మందు బిళ్ళల పత్తలను వెంటపెట్టుకొని, తినడానికి ముందు, తర్వాత ట్యాబ్లేట్స్ ‌వేసుకోవడం పరిపాటిగా మారింది.  ఇందుకు కారణమైన వరి అన్నాన్నే మూడు పూటల భుజించడం, అందులోని అధిక మోతాదులో ఉండే కార్బోహైడ్రేట్లే కారణం. మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరిని పండిచొద్దని,FCI గోదాముల్లోఉండాల్సిన నిల్వల కంటే అధికంగా ఉన్నాయని హెచ్చరికలు జారిచేస్తున్నా, రైతులు కూడా లాభదాయకంగా ఉండే వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపుతునన్నారే తప్ప చిరు ధాన్యాలు పండించడానికి ఇష్టపడకపోవడానికి కారణం ప్రభుత్వాలు సజ్జ, జొన్న, రాగులు, అరికెలు సామలు,ఊదలు,కొర్రలు, అండు కొర్రలు వంటి చిరు ధాన్యాల పంటలపై సబ్సిడీలు, తగిన ధరలు,అవగాహనను రైతులకు కల్పించకపోవడమే.

సమతుల, నాణ్యమైన పౌష్టికాహారం పొందలేక 2021 లో ప్రపంచ ఆకలి సూచీలో(Global Hunger Index)) 116 దేశాల్లో   భారత దేశం స్థానం గణనీయంగా 101వ స్థానానికి పడిపోయి అనారోగ్య భారతాన్ని ఆవిష్కరించిన ఘనత పాలకులదే.! కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ గణాంకాలను, దీనికనుసరించిన పద్ధతులు ఆశాస్త్రీయమైనవని, అహేతుకమని కొట్టిపారేసినప్పటికీ, వాళ్ళు తీసుకున్న నాలుగు అంశాలైన పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం, వయసుకు తగిన బరువు లేకపోవడం, చిన్నారుల మరణాలు మీద స్వీయ సమీక్ష చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుత పాలకుపై ఉంది. వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీలు శిశు మరణాల రేటును తగ్గించిన మాట వాస్తవమే అయినప్పటికీ, మారిన ఆహారపలవాట్లు, మానసిక ఒత్తిడిల వల్ల సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోవడం విశ్లేషకుల అంచనాలకు సైతం అందకుండా ఉంది.

సిరి(చిరు) ధాన్యాలు(మిల్లెట్స్)‌గా పిలువబడే సజ్జలు, జొన్నలు, రాగులు, అరికెలు, సామలు,కొర్రలు, అండుకొర్రలు,ఊదలు,వరిగెలు వంటివి నేడు ధనవంతుల ఆహారంగా పిలువబడుతుంది.ఇందులో మనకు అవసరమైన పోషకాలైన విటమిన్‌ ‌బీ, ఐరన్‌, ‌ఫైబర్‌, ‌ప్రోటీన్స్, ‌మినరల్స్, ‌కాల్షియం, కాపర్‌, ‌జింక్‌, ‌మెగ్నీషియం, ఫ్యాటీ ఆసీడ్స్, ‌విటమిన్‌ ‌బి6, ఫోలిక్‌ ఆసిడ్‌, ‌గ్లుటిన్‌ ‌ఫ్రీ, పొటాషియం,విటమిన్‌ ‌జు, బోరాన్‌, ‌మాంగనిస్‌, ‌పాస్పరస్‌, ‌సల్ఫర్‌ ‌వంటివి సమృద్ధిగా దొరుకే వీటిని తీసుకోవడం వల్ల సంతాన లేమి, థైరాయిడ్‌, ‌రక్తహీనత, నిద్రలేమి, కంటి చూపు, హార్మోన్ల సమస్యలు, షుగర్‌, ‌బీపీ, చర్మ సమస్యలు, గుండె జబ్బులు, ఊభకాయం, అజీర్తి వంటి సమస్యలు ఎదుర్కొవడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరిగి కోవిడ్‌ ‌భారిన పడకుండా, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు శరీరం తనంతట తానే రోగాన్ని నయం చేసుకోగలుతుంది. ఇవన్నీ సమృద్ధిగా దొరికే మిల్లెట్స్ ‌ను మనం, మన పిల్లలకు తినిపించకుండా,  కార్పొరేట్‌ ‌కంపెనీల అడ్వర్టైజ్‌ ‌మెంట్‌ ‌లకు ఆకర్షితులై మార్కెట్లో దొరికే సహజసిద్దం కాని ఉత్పత్తులను తినిపిస్తూ, ఆర్గానిక్‌ ‌ఫుడ్‌ ‌కి దూరం చేస్తూ, వాటివల్ల వచ్చే సేడ్‌ ఎఫెక్టస్ ‌తో రోగాలను కొని తెచ్చుకొని, కష్ట పడి సంపాదించినదంతా అప్పనంగా ఆసుపత్రుల పాలు చేస్తున్నాం. మార్కెట్లో ఏ వస్తువు కొన్నా కల్తీవే అధికంగా ఉంటున్నాయి, వంట నూనెల నుండి మొదలుకొని తీసుకునే ఔషధాలు సైతం నాణ్యమైనవి దొరక్కపోవడం తద్వారా శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తి సామర్ధ్యాలను తగ్గి వ్యాధుల బారిన పడుతున్నారు. డా. ఆండ్రి కార్టన్‌ అనే పరిశోధకులు మనిషిలో IQ(Intelligent quotient)) EQ(emotion quotient) ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే జీవితంలో ఎక్కువ విజయాలు సాధించారని తెలిపారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలంటే సరైన పోషక విలువలున్న పౌష్టికాహారం తీసుకోవాలి. ఒక్కో పోషకం కోసం వేరు వేరుగా తినకుండా చిరు ధాన్యాల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అజీర్తి వంటి సమస్యలేమి తలెత్తవని కర్ణాటక లో ‘డిఫెన్స్ ‌ఫుడ్‌ ‌రీసెర్చ్ ‌ల్యాబరేటరీ’ లో డా. దాదా సాహెబ్‌ ‌దత్తాత్రేయ వాదికర్‌ ‌గారు పరిశోధన చేసిన పేపర్‌ ‘ఇం‌డియన్‌ ‌జర్నల్‌ ఆప్‌ ‌న్యూట్రిషన్‌’ ‌లో పబ్లిష్‌ అయ్యింది. కారు చౌకగా లభించే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు అవగాహన ఉన్నప్పటికీ, తినడానికి వెనకడుగు వేయడానికి ప్రభుత్వాలు ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడమే కారణం. మన సంప్రదాయక ఆహారమైన చిరుధాన్యాలను తినండి, ఆరోగ్య భారతాన్ని నిర్మించండి.
– ముఖేష్‌ ‌సామల, సామాజిక విశ్లేషకులు, 9703973946

Leave a Reply