Take a fresh look at your lifestyle.

బుద్ధుడి బోధనలతో .. ప్రపంచ సవాళ్లను అధిగమించవచ్చు

ఇండో-జపాన్‌ ‌సంవాద్‌లో మోడీ ప్రసంగం

గౌతమ బుద్ధుడి బోధనలతో ప్రపంచ సవాళ్లను అధిగమిం చవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అబి •ప్రాయపడ్డారు. సోమవారం భారత్‌ – ‌జపాన్‌ ‌సంవాద్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. వృద్ధి సరళి మానవ కేంద్రిత విధానాన్ని అనుసరించాలన్నారు. ప్రపంచ వృద్ధి చర్చలు కేవలం కొద్ది మధ్య మాత్రమే జరుగరాదని, ఈ అజెండా మరింత విస్తృతం కావాలన్నారు. ఎదుగుదల నమూనాలు మానవ కేంద్రిత విధానాన్ని అనుసరించాలన్నారు. మన పరిసరాలను సామరస్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన ఉనికికి మూలస్తంభంగా ఉన్న ప్రకృతితో సామరస్యపూర్వక సహజీవనాన్ని మనం రూపొందించాలని అన్నారు.సంప్రదాయ బౌద్ధ సాహిత్యం, గ్రంథాలతో లైబ్రరీ ఏర్పాటుకు ప్రతిపాదించారు.

- Advertisement -

భారత్‌లోనూ ఇలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ మేరకు తగిన సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గ్రంథాలయం వివిధ దేశాల నుంచి బౌద్ధ సాహిత్యం డిజిటల్‌ ‌కాపీలను సేకరిస్తుందని చెప్పారు. వాటిని అనువధించి బౌద్ధ సన్యాసులు, పండితులకు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడడమే లక్ష్యమన్నారు. ఈ గ్రంథాలయం కేవలం సాహిత్యానికే కాదు పరిశోధన, చర్చలకు వేదికగా ఉంటుందన్నారు. ‘సమాజాలు, మానవులు, ప్రకృతి మధ్య నిజమైన సంవాదం’ అని ఆయన పేర్కొన్నారు.త్రుత్వం నుంచి సాధికారత వైపు ప్రజలు ప్రయాణించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సామ్రాజ్యవాదం నుంచి ప్రపంచ యుద్ధం వరకు, ఆయుధ పోటీ నుంచి అంతరిక్షం వరకూ…. ఒకరినొకరు అధిగమించి, దూసుకెళ్లడంలో మునిగిపోయాం.

బుద్ధుడు ప్రవచించినట్లు మనం శత్రుత్వం నుంచి సాధికారిత వైపు వెళ్లాలి. ఆయా దేశాల అభివృద్ధి మానవత్వం అన్న స్వభావ ఆధారంగా ముందుకు కదలాలి. శత్రుత్వం శాంతికి బాటలు వేయదు. విధానాల్లో కచ్చితంగా మానవత్వాన్ని జోడించుకోవాలి. ప్రకృతితో, సాటి మానవులతో సామరస్యంగా జీవించాలని మోదీ ఉద్బోధించారు. ఇంతటి అపురూపమైన బౌద్ధ సాహిత్యానికి ఓ గ్రంథాలయం ఉంటే బాగుంటుందని, కొత్తరకమైన ఆవిష్కరణలన్నీ అభివృద్ధికి బాటలు వేస్తాయన్నారు. బౌద్ధ సాహిత్యానికి, గ్రంథాలకు ఓ గ్రంథాలయం ఉంటే బాగుంటుంది. అదీ భారత్‌లో ఉంటే మరింత బాగుంటుంది. వాటికి అవసరమైన సదుపాలయన్నీ ప్రభుత్వం పక్షాన కల్పిస్తాం. ప్రపంచంలో ఉన్న బౌద్ధ సాహిత్యం మొత్తాన్ని ఒకచోట చేర్చి, వాటికి డిజిటల్‌ ‌రూపం ఇచ్చి, వివిధ భాషల్లోకి అనువదించి బౌద్ధులకు, బౌద్ధ భిక్షువులకు అందుబాటులో ఉంచితే చాలా బాగుంటుందని మోదీ సూచించారు.

Leave a Reply