Take a fresh look at your lifestyle.

1 ‌లక్షా 20 వేల ఉద్యోగాలకు…

  • నోటిఫికేషన్‌ ఇవ్వండి…మీ అభ్యర్థినే ఏకగ్రీవంగా గెలిపిస్తాం
  • ఉద్యమకారులను మరచిన టీఆర్‌ఎస్‌, ‌ప్రశ్నించే గొంతును గెలిపించాలి
  • అధికార పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఇంకో భజన భక్తుడు పెరుగుతాడు
  • నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు

ఒక్క జిందాల్‌ ‌కంపెనీ కోసం ఎంతో మంది గూండాలు ఎన్నో తండాల సంస్క్నతిని నాశనం చేస్తుంటే మాట్లాడే ఒక్క సన్నాసి అయినా ఉన్నాడా అని మన ఇంటి పార్టీ వ్యవస్థాపన అధ్యక్షులు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌, ‌చెరుకుచెరుకు సుధాకర్‌ ‌ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం సర్వ నాశనం చేస్తున్నా ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడామని చెప్పుకుంటున్న నాయకులు అధికారంలో ఉండి ఎందుకు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల గ్రాండ్‌ ‌హోటల్‌లో అనంతుల మధు అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి అభ్యర్థి డా.చెరుకు సుధాకర్‌ ‌హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ద్రోహులకు నేడు టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎద్దెవ చేశారు. రానున్న నల్గొండ, వరంగల్‌, ‌ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే నాలాంటి స్వతంత్ర అభ్యర్థిని గెలిపించాలని. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో కేసీఆర్‌ ‌కుటుంబ పాలన సాగుతు ందని దుయ్యబట్టారు. నోటిఫికేషన్‌ ‌లేక విద్యార్థులు ప్రాణత్యాగాలకు పాల్ప డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నోరులేని ప్రజా ప్రతినిధులుగా ఉన్నారనీ, ప్రజా సమస్యలను వినిపించడంలో పూర్తిగా విఫల మయ్యారని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ని చూడగానే ఎమ్మెల్యేలకు మాట రాకుండా పోయిందని మండిపడ్డారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందనీ, ఆ తిరుగుబాటు చరిత్ర తెలంగాణ భూమికి ఉందనీ, దానిని తెలంగాణ ప్రజలు అలవాటు చేసుకో వాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమయంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారనీ, వాటిని ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని సవాల్‌ ‌విసిరారు. మీరు తక్షణమే లక్షా 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వండి, రాష్ట్రంలో ఉన్న యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వండి మీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఏకగ్రీవంగా మండలిని ఏకగ్రీవంగా పంపిస్తావమని సవాల్‌ ‌విసిరారు. గాదరి కిషోర్‌, ‌బాల్క సుమన్‌లు విద్యార్థుల నాయకులమని చెప్పుకొని ఎమ్మెల్యేలుగా గెలిచి నేడు నిరుద్యోగ యువత సమస్యలపై మాట్లాడకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దండలు వేయించుకునే దండగ ఎమ్మెల్యేలారా మీరు ప్రజల కోసం ఏమి చేస్తున్నారు, మీరు కేసీఆర్‌ ‌చేతిలో కీలుబొమ్మలు తప్ప మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ను ప్రశ్నించే తన లాంటి వ్యక్తులను శాసన మండలికి పంపిస్తే నిరుద్యోగ యువతి, యువకుల, ప్రజాసమస్యల నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు.

ఏనాడు ఉద్యమంలో పాల్గొనని పల్లారాజేశ్వర రెడ్డి తన సొంత కళాశాల అభివృద్దికే ఎన్నికల భరిలో నిలిచాడని తెలిపారు. తెలంగాణ కోసం ఇదే సూర్యాపేట వేదికగా పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాననీ, నేటికీ ఈ ప్రబుత్వ నియంత పోకడలను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఇంకో భజన భక్తుడు పెరుగుతాడు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదనీ, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. పాత పెన్షన్‌ ‌విధానం, విద్యా రంగం అభివృధ్దికి శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. కరోనా నేపధ్యంలో సమీకరించిన నిధులు ఏమీ చేశారో ఇంతవరకు ప్రజలకు తెలపకపోవడం విడ్డురంగా ఉందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో దద్దమ్మప్రభుత్వం కొనసాగుతుందని దుయ్యబట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంతోమంది మహనుభావులు, పోరాట యోధులు పుట్టిన గడ్డ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున సూర్యాపేట గడ్డపై ఉద్యమం మొదలైందని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో అనంతుల మధు, భత్తుల సోమయ్య గౌడ్‌, ‌కుందూరు దేవెందర్‌ ‌రెడ్డి, భాషపంగు సునీల్‌, ‌నాగేశ్వరరావు, భారీ అశోక్‌, ‌సంపత్‌, ‌కృష్ణ, సందీప్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply