Take a fresh look at your lifestyle.

నన్ను పుట్ట(బతక)నివ్వండి…!

“చాలా మంది ఉద్యోగులు, విద్యావంతులు మొదట సంతానం అబ్బాయి పుట్టగానే రెండో బిడ్డ (సంతానాన్ని) కనకుండా ఆపేస్తున్నారు. ఉన్నత(విద్యావంతులైన) కుటుంబాల్లో ఆలస్యంగా పెళ్ళిళ్లు కావడం, ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితమౌతుండడం, లింగనిష్పత్తి తగ్గేందుకు కారణమౌతుందని విశ్లేషిస్తున్నారు.”

భారతదేశంలో మహిళలను పూజ్య భావంతో చూస్తారనే పురిటిగడ్డలో ఇప్పుడు ఆడబిడ్డలను వద్దనుకుంటున్నారా! లేక అబ్బాయి పుడితే చాల్లే అని సరిపెట్టుకుంటున్నారా ? పై విధానాల మూలంగా కారణం ఏదైనా.. కారకులెవరైనా! దేశవ్యాప్తంగా తగ్గుతున్న ఆడపిల్లల జననాల ఫలితంగా లింగ నిష్ఫత్తిలో తేడాలు చూస్తుంటే ఆందోళన కలిగించే అతి ప్రమాదకర అంశమని తెలుస్తుంది. మరీ చదువస్తే ఉన్నమతి పోయినట్లుగా.. విజ్ఞానవంతులు, చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉండే పట్టణ, నగర ప్రాంతాల్లో సైతం ఆడపిల్లల జననాల తగ్గుదల కొద్ది నెలల క్రితం విడుదలైన గణాంకాలు ఈ చేదు నిజాలు కాదనలేని విధంగా ఉంది. ఒక్క అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ‘‘లింగ నిష్పత్తి’’ లెక్కింపును ఇలా చేస్తారు. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు ఎంత మంది అమ్మాయిలు పుట్టారనే సంఖ్యనుబట్టి నిర్ధారిస్తారు. దేశ వ్యాప్తంగా 2017 జనవరి ఒకటి నుండి డిసెంబర్‌ 31 ‌వరకు నమోదైన జననాల ప్రకారం అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లింగ నిష్పత్తి 1047తో ప్రథమ స్థానంలో ఉండగా, చత్తీస్‌గడ్‌ 78 ‌తగ్గి 968తో రెండవ స్థానంలో నమోదైంది. ఇలా దేశం మొత్తంమీద పుట్టిన వారిలో అబ్బాయిల కన్నా, అమ్మాయిలు సుమారు 11.21 లక్షల మంది తక్కువగా ఉన్నారు.

Give me the trumpet ...!qదేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరు పొందిన తెలంగాణ, గుజరాత్‌, ‌పంజాబ్‌, ఆం‌ధ్రప్రదేశ్‌, ‌తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే లింగ నిష్పత్తి దారుణంగా తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శంగా జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలో మాత్రమే ఆడ శిశువుల జననాలు ఎక్కువగా ఉన్నాయి. ఇచ్చట గిరిజన (జనాభా) గ్రామాలు ఎక్కువగా ఉండి, అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పటికీ ఈ జిల్లాలో 4,962 మంది బాలురకు గాను 4,994 బాలికలున్నారు. దేశవ్యాప్తంగా చూసిన ఇలాంటివి అరుదుగా ఉన్నాయి. అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో వివక్ష ఎక్కువే ? ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పేరున్న పంజాబ్‌ ‌రాష్ట్రంలోని అమృత్‌సర్‌ ‌జిల్లాలో 24,906 మంది బాలురుకుగాను 19,158 బాలికలు మాత్రమే ఉన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌జిల్లాలో 97,962కి, 90,495 మందే అమ్మాయిలు ఉన్నారు. దేశంలో రాష్ట్రాల వారీగా లింగ నిష్పత్తిలో చూస్తే తెలంగాణ 20వ, ఆంధ్రప్రదేశ్‌ 11‌వ స్థానంలో ఉన్నాయి. ఇలా 2017లో రాష్ట్రాల వారీగా ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు, అమ్మాయిల సంఖ్య లింగ నిష్పత్తిలో ఆఖరున ఉన్న పంజాబు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది బాలురకు కేవలం 890 మంది అమ్మాయిలే పుట్టారు. చివరనుంచి రెండవ స్థానంలో ఉన్న గుజరాత్‌లో 898 మందే ఉన్నారు. దేశంలో లింగ నిష్పత్తి అతి తక్కువగా అంటే ? 900 కంటే దిగువన ఉన్నది, ఈ రెండు రాష్ట్రాలే కావడం గమనార్హం. మన దేశంలో అభివృద్ధి చెందిన ప్రాంతా(రాష్ట్రా)ల్లో ఆడపిల్లల జననాలు తక్కువగా ఉండటానికి కొన్ని కారణాలను అధికార వర్గాలు చెప్పుకొచ్చేవి… చాలా మంది ఉద్యోగులు, విద్యావంతులు మొదట సంతానం అబ్బాయి పుట్టగానే రెండో బిడ్డ (సంతానాన్ని) కనకుండా ఆపేస్తున్నారు. ఉన్నత(విద్యావంతులైన) కుటుంబాల్లో ఆలస్యంగా పెళ్ళిళ్లు కావడం, ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితమౌతుండడం, లింగనిష్పత్తి తగ్గేందుకు కారణమౌతుందని విశ్లేషిస్తున్నారు. అలాగే విదేశాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాల్లో జననాలకు భారత రాయభార కార్యాలయాల్లో నమోదు ప్రకారం 2017లో 110 దేశాల్లోని భారతీయ కుటుంబాల్లో 12,479 మంది జన్మించారు. వారిలో బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య 155 తక్కువగా ఉంది. మరికొన్ని దేశాల్లోని భారతీయ కటుంబాల్లో బాలికలు ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది.

భారతదేశంలో లింగనిర్ధారణ పరీక్షలపై వందలకోట్ల రూపాయల వ్యాపారం అక్రమ, అనైతిక పరిశ్రమగా రూపుదాల్చి, బాలిక అని తెలియగానే భ్రూణ హత్యలకు పూనుకుం టున్నది అమానవీయంగా విద్యావం తులేననేది కాదనలేని నిజం. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 940 స్త్రీలు, ప్రతి వెయ్యిమంది బాలురకు 919 బాలికల వ్యవత్యాసమని తెలిపింది. మానవా ! నిన్ను నువ్వే సంస్కరించుకో లేదంటే సృష్టి మూలానికి విఘాతం సుమా.. ! లింగ వివక్ష రూపు మాపడానికి పాలకులు ఆడపిల్లలు తక్కువ, మగ పిల్లలు ఎక్కువనే.. ప్రజల్లో దుర్మార్గపు భావనలు వీడేలా పౌర సమాజాన్ని చైతన్య పరచాలి. ‘‘బేటి బచావో, బేటి పడావో’’ నినాదాలకే పరిమితం చేయకుండా మనమంతా విజ్ఞతతో వ్యవహరిస్తూ లింగ వివక్షలేని సమాజాన్ని ఏర్పరచుకోవాలి. సృష్టిలో మానవజాతి పునరుత్పత్తికి ఆడబిడ్డే ఆధారం. లేదంటే మానవజాతికి మనుగడే లేదని తెలుసుకో మానవుల మనుస్సుకు పట్టిన బాలికలపై ‘‘వివక్షా మలినాన్ని’’ కడిగేస్తే మంచిదని గమనించండి. దేశవ్యాప్తంగా తగ్గుతున్న ఆడపిల్లల జననాలపై ప్రభుత్వాలు మేల్కొనకపోతే! లింగవివక్షతో మానవజాతి ప్రమాదంలోకి జారిపోతుంది. ఇంతటి ప్రాధాన్యతాంశంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి. ఆందోళన కలిగించే అంశంలో విద్యావంతులే ఇలా బాధ్యతా రాహిత్యంగా సృష్టికి విరుద్దంగా వ్యవహరిస్తే రేపటి భవిష్యత్తు సమాజం ఏమైపోవాలి ? ఇంత తీవ్రతగల అంశాన్ని ఇన్నాళ్లు జాలిగ గాలికి వదిలేసి రాత్రికి రాత్రే మార్పు రమ్మంటే రాదు కదా. అకుంఠిత దీక్షతో పాలకు(ప్రజ)లనుంచి బాధ్యత పెరగాలి.

ఆడపిల్లల్ని పుట్టనివ్వకుండా.. పుట్టినా బ్రతకనివ్వకుండా చేయడం అనేది తరతరాలుగా కొనసాగుతుంది. నాడు అజ్ఞానాందకారమనుకుంటే ? శాస్త్ర విజ్ఞానం పెరిగినవేళ విద్యావంతుల నేటి సమాజంలో కూడా ఆడపిల్ల పుట్టకుండా అతి తెలివితో నేడు వ్యవహరించడం విషాదంతో కూడిన, దుర్మార్గపు ఆధునిక పోకడలో తల్లికావాలి, చెల్లికావాలి కానీ ఆడబిడ్డ మాత్రం పుట్టకూడదని పురిటిలో చంపేస్తున్న విధానాలను కట్టడి చేయలేని పాల కులు, ఇది అనైతికమని తెలిసి చేస్తున్న పౌర సమాజాన్ని చూస్తుంటే సిగ్గే స్తుంది. ఇంకే న్నాళ్లు నిస్సిగ్గు పనులు. రేపటి సమాజం కోసం దయ చేసి నన్ను పుట్ట (బ్రతక) నివ్వండి.. !
మేకిరి దామోదర్‌, ‌వరంగల్‌ ‌సెల్‌: 9573666650

Leave a Reply