Take a fresh look at your lifestyle.

ఒక్క సారి గెల్లుకు అవకాశం ఇచ్చి చూడండి..

  • కేంద్ర మంత్రులు వొచ్చి హుజురాబాద్‌ అభివృద్ధిపై ఎందుకు మాట్లాడరు
  • పేదలకు మాత్రం దండగ అంటున్న వ్యక్తి
  • దళిత బంధు ప్రతీ దళితునికే అందేలా చూసే బాధ్యత నాది : ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు
  • కమలాపూర్‌ ‌మండలం ఉప్పల్‌లో ఎన్నికల ప్రచారం

‘‘‌కాంగ్రెస్‌ ‌పార్టీ అడుగు బొడుగు లేదు..టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ రెండు ఉన్నాయి. ఏ పార్టీకి వోటు వేయాలో ఆలోచించాలి. నిజాన్ని గ్రహించి ధర్మానికి, న్యాయానికి వోటు వేయాలి. అని మంత్రి హరీష్‌ ‌రావు మంగళవారం  కమలాపూర్‌ ‌మండలం ఉప్పల్‌లో ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ కేసీఆర్‌కు మానవత్వం ఉందా అని అన్నారు. కాని దేశంలో కేసీఆర్‌ అం‌త మానవాతావాది ఎవరు ఉన్నారు.

అసరా తీసుకున్న అవ్వను అడుగు, కల్యాణ లక్ష్మి తీసుకున్న పేదింటి ఆడపిల్లను, రైతు బంధు తీసుకున్న రైతన్నను అడుగు కేసీఆర్‌కు మానవత్వం ఉందా లేదా… అని కడుపు నిండి ఉన్న రాజేందర్‌ ‌రైతు బంధు దండగ, కల్యాణ లక్ష్మి పరిగె ఏరుకున్నట్లు అంటున్నడు. తాను మాత్రం పది లక్షల 50 వేలు రైతు బంధు తీసుకున్నడు. రైతులకు మాత్రం దండగ అంటున్నడు. రైతులు బాగుంటే రాజ్యం బాగుంటదని కేసీఆర్‌ ‌భావిస్తున్నరు. ఏడేళ్ల క్రితం రైతన్నక రెంటు కోసం గట్టమీదనే పడుకున్న పరిస్థితి. ఇవాల కరెంటు బాధలున్నయా..ఎండా కాలంవస్తే పూడికలు తీయాల్సిన పరిస్థితి. క్రేన్లు కిరాయకి తెచ్చి బావుల పూడిక తీసేవారు. డబ్బులన్నీ అయిపోయే పరిస్థితి. కాని కేసీఆర్‌ ‌కాళేశ్వరం నీరు తెచ్చాక కాలువల్లో నీరు.

రైతుకు సాగు నీటి ఇబ్బంది ఉందా…రైతుకు ఐదు లక్షల బీమా ఇస్తున్నది టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కాదా..బీజేపీ పార్టీ రైతుల గురించి ఏమంటున్నడు. బాయిల కాడ  మీటర్లు పెట్టమంటోంది రాజేందర్‌ ‌చేరిన బీజేపీ పార్టీ. నల్ల చట్టాలని, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని అన్నడు రాజేందర్‌. ఇప్పుడు తనకు పదవి కావాలని బీజేపీలో చేరిండు. రాజేందర్‌ ఎం‌దుకు రాజీనామా చేసిండు. హుజూరాబాద్‌ ‌జిల్లా చేయాలన్నడా..కమలాపూర్‌లో మెడికల్‌ ‌కాలేజి, డిగ్రీ కాలేజి, పాలిటెక్నిక్‌ ‌కాలేజి కావాలని చేసిండా.. తన స్వార్థం కోసం రాజీనామా. రాజేందర్‌ ‌గెలిస్తే, తనకు, బీజేపీ పార్టీకి లాభం, గెల్లు గెలిస్తే హుజూరాబాద్‌ ‌ప్రజలకు లాభం..30 తర్వాత టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉంటుంది, సీఎంగా కేసీఆర్‌ ఉం‌టారు…మంత్రిగా ఈటల ఒక్క ఇల్లు కట్టలేదు. రేపు పనులు జరుగుతాయా..ఆరు సార్లు గెలిచిన రాజేందర్‌ ఒక్క మహిళా భవనం అయినా కట్టారా…మా నియోజకవర్గంలో చిన్న ఉర్లలో కూడా మహిళా భవనం కట్టాను. పండుగ పూట వడ్డీ లేని రుణం కావాలని అడిగితే 25 కోట్ల రూపాయలవడ్డీ లేని రుణం ఇచ్చాం…శంభుని పనిలో రాజేందర్‌ ‌చెల్లని చెక్కు ఇచ్చిండు అన్నడు.

ఇంత అబద్దాలా..వోట్లు కావాలంటే ఏం చేస్తవో చెప్పు…చెక్కు చెల్లిందా లేదా అక్కా చెళ్లెళ్లకు తెలియదా…బీజేప రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌సన్నహితుడి కారు ఆటోడ్రైవర్‌ను గుద్దితే, అది మా సుమన్‌ ‌కారు గుద్దిందని తప్పుడు ప్రచారం చేశారు…గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర వెయి రూపాయలు మీ బీజేపీ పుణ్యమా అని అయిందని, వోట్లు ఎలా అడుగుతవు అని అడిగాను. సబ్సిడీ ని బంద్‌ ‌పెట్టారని చెప్పా…బీజేపీ పెద్ద నాయకుడు నేను అంటున్నవు కదా..నన్ను గెలిపిస్తే సిలండర్‌ ‌ధర 500 రూపాయలకు తగ్గిస్తామని చెప్పమన్నా. అందుకు 291 రూపాయలు రాష్ట్ర పన్ను ఉందని తగ్గించమని అన్నారు…తర్వాతి రోజు 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉంటే రాజీనామా చేస్తా అని సవాల్‌ ‌విసిరా.. ఐదు రోజులయింది చప్పుడు లేదు. ఎన్ని అబద్దాలు. వేయి రూపాయలు బీజేపీ ప్రభుత్వం పెంచింది తప్ప రాష్ట్ర పన్ను లేనే లేదు…ధరలు పెంచి పేద వాడు బతకుండా చేసిన బీజేపీలో చేరిన వోటు వేయమని రాజేందర్‌ అడుగుతున్నారా…రాజేందర్‌ ‌గారు చేసిందేమి లేదు.. చేసేది ఏమీ లేదు. దళిత బందు కార్యక్రమం చేస్తే బీజేపీ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేస్తే 30 వ తేదీ వరకు ఆపమని ఎన్నికల సంఘం ఆదేశించింది…మీరు ఒక్క రూపాయి ఇవ్వరు.

ఇస్తే టీఆర్‌ఎస్‌ ‌కు పేరువస్తుందని దళిత బంధు ఆపారు. కాని పది రోజులు ఆపుతరు అంతే.. ఐదో తారీకు మళ్లీ వస్తా దగ్గరుండి యూనిట్లు గ్రౌండ్‌  ‌చేయిస్తా…ప్రతీ దళిత కుటుంబానికి  లబ్ధి చేకూర్చే బాధ్యత నాది…కళ్యా ణ లక్ష్మి ముందట ఎస్సీలకు  ఇచ్చారు. తర్వాత అన్ని కులాలు, మతాల పేదలకు ఇచ్చారు…కళ్యాణ లక్ష్మి తరహాలోనే అన్ని కులాలు ,మతాల్లోని పేదలకు   సాయం చేస్తాం…వానాకాలం పంట ప్రతీ గింజా ఐకేపీ సెంటర్ల ద్వారా కొంటాం.  ఇది ఎవరితో సాధ్యం అవుతుంది…రాజేందర్‌   ‌బొంద పెడతా, అగ్గిపెడతా, కూలగొడతా… అన్నడు తప్పపేదలకు సాయం చేస్తా. ఇళ్లు కడతా అని ఏమైనా చెప్పాడా…తిట్టడం వల్ల కడుపు నిండదు. తాను ఏం చేస్తాడో చెప్పాలి కదా…57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్‌ ఇస్తా.ం మహిళా భవన్‌ ‌పూర్తి చేయిస్తా, స్వంత జాగ  ఉన్న వారికి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తాం…17 ఏళ్లు రాజేందర్‌ ‌ను చూశారు. ఒక్క సారి గెల్లుకు అవకాశ ఇవ్వండి…గెలిపిస్తే సాయం చేస్తాన అని కేంద్ర మంత్రులు ఏమైన చెప్పారా…ప్రజల పక్షాన ఉండే టీఆర్‌ఎస్‌ ‌ను గెలిపించుకుందామా బీజేపీలోకి ఆస్థులుకాపాడుకోవడనికే వెళ్లారు తప్ప సేవచేయడానికి కాదు…అని అన్నారు

Leave a Reply