Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఇంటర్‌ ‌ఫలితాల్లో బాలికల హవా

  • ఇంటర్‌ ‌బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత
  • ఫస్టియర్‌లో 60.01 .. సెకండియర్‌లో 68.86 శాతం ఉత్తీర్ణత
  • ఫస్టియర్‌లో మేడ్చెల్‌.. ‌సెకండియర్‌లో కుమ్రం భీమ్‌ ‌జిల్లాల ముందంజ 
  • ఫలితాలను  వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చిన బోర్డు 
  •   ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ‌పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. మొదటి సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 80 వేల 516 మంది హాజరు కాగా…60.01 ఉత్తీర్ణత శాతం నమోదైంది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ ‌జిల్లా ప్రథమ స్థానంలో నిలబడింది. ఇక రెండో స్థానంలో 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కుమ్రంభీం జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. ఇక  సెకండియర్‌లో 4 లక్షల 85 వేల 323 మంది విద్యార్థులు హాజరు కాగా… 68.86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 76 శాతం ఉత్తీర్ణతతో కుమ్రంభీం తొలి స్థానంలో నిలబడింది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ ‌రెండో స్థానం దక్కించుకుంది. మొత్తం 25 వేల మంది  ఇన్విజిలేటర్లు హాజరు కాగా… 9 లక్షల 65 వేల 839 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని మంత్రి
ప్రకటించారు. ఇంటర్‌ ‌ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ ‌బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు.
గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్‌లో 60.4 శాతం, సెకండియర్‌లో 68.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. ఫస్టియర్‌లో బాలికలు 67 శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు.సెకండియర్‌లో బాలికలు 75.15, బాలురు 62.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత ఉత్తీర్ణత శాతం రావడం ఇదే తొలిసారి అన్నారు. ఈ నెల 22 వరకు కాలేజీలకు మార్కుల మెమోలు అందనున్నట్లు తెలిపారు. రీ వాల్యుయేషన్‌, ‌రీ కౌంటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. ఒత్తిడికి గురైతే మానసిక నిపుణులను సంప్రదించాలన్నారు. ఇంటర్‌ ‌బోర్డు ఆధ్వర్యంలో ఏడుగురు మానసిక నిపుణులను నియమించినట్లు వెల్లడించారు. త్వరలోనే అడ్వాన్స్ ‌సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply