Take a fresh look at your lifestyle.

న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో ఆ ప్రియురాలు తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు గురువారం బందువులతో కలిసి ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన వంగల దీపిక, ఇదే మండలం జనంపల్లి గ్రామానికి చెందిన ప్రియుడు వంగాల నవీన్ తో గత మూడు ఎండ్లుగా ప్రేమించుకున్నామని, అయితే నవిన్ ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని వంగల దీపిక ఆరోపిస్తోంది.

ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారీరకంగా దేగ్గరయ్యమని ఆరోపించింది. ఇప్పుడు నేను గర్భవతినాని పెళ్లి చేసుకోవాలని పలు మార్లు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికి నిరాకరించడంతోనే ఇంటి ముందు టెంట్ వేసి ధర్నాకు దిగనని చెప్పింది. నవిన్ ఇంటికి తాళం వేసి ఉండగా.. దీపిక తన బంధువులతో కలిసి అతని ఇంటి ఎదుట బైఠాయించింది. న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటోంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy