Take a fresh look at your lifestyle.

గిరిజన గర్జన !

అడవి తల్లి ముద్దు బిడ్డలం
సమాజానికి మూల వాసులం
వన సంపదకు సిసలు వారసులం

తరతరాలుగా…
పోడు ఎవుసం చేసేటోళ్లం
పొట్టకూటికి పాట్లు పడేటోళ్లం

చరిత్ర గతి మారినా
మా బతుకు తీరు మారలేదు

స్వాత్రంత్రం సిద్దించినా
అభివృద్ధి ఫలాలు అందలేదు

ఇపుడు…
దోపిడీ మరిగిన రాక్షస రాజ్యం
వనంపై కన్నేసి కత్తుల దూస్తోంది

అటవీ సంపదను కొల్లగొట్టి
బ్యూరోక్రాట్లకు కట్టబెడుతుంది

దండకారణ్యాన్ని దురాక్రమించి
పచ్చటి బతుకులు కూలదోస్తుంది

ఆదివాసీ హక్కుల కాలరాస్తుంది
మన్నెంపై ఉక్కుపాదం మోపుతుంది

దుష్ట మూకలూ !
విధ్వంసకర చర్య ఆపకుంటే…

చిగురుటాకులు …
కత్తులై విచ్చుకుంటయ్‌

‌గడ్డి పరకలు …
గండ్ర గొడ్డళ్లయి మెరుస్తయ్‌

‌చలి చీమలు …
పులి బొబ్బిలై గాండ్రిస్తయ్‌

‌తెల్ల పావురాలు ..
ఎర్ర గీతాలు ఆలపిస్తాయి

గిరిజన గూడాలు దండుగట్టి
గెరిల్లా దాడికి సన్నద్ధమౌతాయ్‌
‌దోపిడీ నేతలారా తస్మాత్‌ ‌జాగ్రత్త

– కోడిగూటి తిరుపతి, 9573929493.

Leave a Reply