Take a fresh look at your lifestyle.

ఆర్థిక వ్యవస్థ స్వరూపం మారుస్తున్న ‘గిగ్‌ ఎకానమీ..!

“యుఎస్‌లోని గిగ్‌ ఎకానమీ, చేసే పనిలో కార్మికులకు అధిక పని స్వతంత్రం కల్పించేదిగా ఉనికిలోకి వొచ్చింది. ఇక భారతదేశంలో, అధిక సంఖ్యలో కార్మికులు తమ ప్రతిభ.. నైపుణ్యాలను ఉపయోగించుకునే అవకాశాలను కోరుకుంటున్నారు. పట్టణ యువతలో చాలా నిరుద్యోగం ఉంది ప్రజల జీవన వ్యయం పెరగడం చూస్తున్నాం. మరోవైపు విద్యార్థుల ఆకాంక్షలు పెరగడం కనిపిస్తున్నది. ఇంటిపనిలో నిమగ్నమైన మహిళల ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వొచ్చింది. ఇంటి పని కాకుండా అదనగా ఆదాయం కావాలి అంటున్నది నేటి గృహిణి. ఈ పరిస్థితిలో భారతదేశం గిగ్‌ ఎకానమీ వైపు చూస్తుంది. భారత్‌లో ఫ్రాప్‌, ఇం‌టర్న్‌షాల, ఆవిగ్న్ ‌వంటి గిగ్‌ ‌ప్లాట్‌ఫారమ్‌ల ఉనికి భారత్‌ ‌లో రోజురోజుకి పెరుగుతున్నది.”

కొరోనా కల్లోలం తరవాత తెరపైకి ప్రస్పుటంగా వొచ్చిన పదం ‘‘గిగ్‌ ఎకానమీ’’. గిగ్‌ ఎకానమీ అంటే ఏమిటి..? ఇది పరిశ్రమల అధిపతులకు ఎలా ఉపయోగపడుతున్నది..? శ్రామికులకు ఎలాంటి పనిని వేతనాన్ని అందిస్తున్నది.? గిగ్‌ ఎకానమీ కార్మికులకు అనుకూలమైందేనా..? ఈ ప్రశ్నలు నేడు చాలా ముఖ్యమైనవి.

గిగ్‌ ఎకానమీ అంటే ఏమిటి?
శాశ్వత ఉద్యోగాలు కాకుండా స్వల్పకాలిక ఒప్పందాలు మీద ఆధారపడి లేదా ఫ్రీలాన్స్ ‌వర్క్ ‌కల్పించే లేబర్‌ ‌మార్కెట్‌ను గిగ్‌ ఎకానమీ అంటున్నారు. అంటే ఒకానొక పని జరిపించుకోవాలనుకునే పరిశ్రమ అధిపతి లేదా సేవల వినియోగదారుడు ఒకవైపు.. సదరు పని చేయటానికి సిద్ధంగా వున్న కార్మికుడు లేదా కార్మికురాలు మరోవేపు..నిలబడి బేరం చేసుకుంటే అది గిగ్‌ ఎకానమీ. ఇక్కడ సర్వీస్‌ ‌ప్రొవైడర్‌ అం‌టే ఒక నిర్దిష్ట పని చేయగల ఒకానొక గిగ్‌ ‌వర్కర్‌ అని అర్థం. గిగ్‌ ఎకానమీ అంటే ఓ ప్రాజెక్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కూడా. గిగ్‌ ఎకానమీలో ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఉద్యోగం చేయటం అనేది కాకుండా ఆన్‌-‌డిమాండ్‌, ‌ఫ్రీలాన్స్, ‌టాస్క్-‌బేస్డ్ ‌పని చేయటంగా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్-ఆధారిత గిగ్‌ ఎకానమీలో ఓవర్‌ ‌హెడ్‌ ‌ఖర్చులను సర్వీస్‌ అడాప్టర్‌ ‌బాగా తగ్గించుకోవచ్చు. గిగ్‌ ‌వర్కర్లలో స్వయం ఉపాధి కార్మికులు, ఫ్రీలాన్సర్స్, ‌స్వతంత్ర కంట్రిబ్యూటర్స్, ‌పార్ట్ ‌టైమ్‌ ‌కార్మికులు ఉన్నారు. ఒక నిర్దిష్ట పని కోసం గిగ్‌ ‌వర్కర్‌కి ఒక నిర్ణీత జీతం చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆర్థిక వ్యవస్థకి కార్మికులను సమకూర్చేది టెక్‌-ఎనేబుల్‌ ‌ప్లాట్‌ఫా•ర్మస్ అయిన ఇ-ప్లాట్‌ఫా•ర్మస్. ‌స్వల్పకాలిక ఒప్పందాల ప్రాతిపదికన వర్కర్స్ ‌సేవలను వాడుకోవడానికి వినియోగదారులను-గిగ్‌ ‌వర్కర్లతో ఇవి కనెక్ట్ ‌చేస్తాయి. ఈ మొత్తం వ్యవస్థనే గిగ్‌ ఎకానమీ అంటున్నారు. అమెరికా దేశం గిగ్‌ ఏకనామికి పుట్టినిల్లు.

అమెరికా వర్సెస్‌ ఇం‌డియా…
యునైటెడ్‌ ‌స్టేట్స్ ఓ అభివృద్ధి చెందిన దేశం. డిజిటలైజేషన్‌, ఆర్థికాభివృద్ధి, సేవలకు ఖర్చుపెట్టగలిగే ఆదాయం అధికంగా ఉన్నందు వలన గిగ్‌ ఎకానమీని ముందుగా అమెరికా స్వీకరించింది. ఈ కారణాల వలెనే యుఎస్‌లో ఉబర్‌, ఎయిర్‌బిఎన్బి, అప్‌వర్క్ ‌వంటి ప్రముఖ గ్లోబల్‌ ‌కంపెనీలు స్థాపించబడ్డాయి. ప్రస్తుతం ప్రపంచ గిగ్‌ ఎకానమీలో యుఎస్‌ అ‌గ్రగామిగా ఉంది. పని చేసే ఫ్రీలాన్సర్ల పెరుగుదల, కొరోనా వలన ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు కారణంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు గిగ్‌ ఎకానమీవైపుకు వెళుతున్నాయి. గ్లోబల్‌ ‌గిగ్‌ ఎకానమీలో టెక్నాలజీ పెరుగుదల కారణంగా, మానవ వనరుల పెరుగుదల కారణంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కూడా రెట్టించిన వేగంతో రానున్న కాలంలో గిగ్‌ ఏకనామిని ఓన్‌ ‌చేసుకోనున్నాయి. యుఎస్‌లో గిగ్‌ ఎకానమీ అధునాతన ఆర్థిక వ్యవస్థగా ఉంటే..అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో గిగ్‌ ‌టాస్క్‌ల ఎదుగుదల ధోరణులు కనిపిస్తున్నాయి. ఈ రెంటిని అధ్యయనం చేస్తే పలు ఆసక్తికర అంశాలు మనకి తెలుస్తాయి. ఉదాహరణకు యూస్‌లో ఊబర్‌..ఎయిర్‌ ‌బిఎన్బి ఉంటే భారతదేశంలో ఓలా..ఓయో ఉన్నాయి.

యుఎస్‌లోని గిగ్‌ ఎకానమీ, చేసే పనిలో కార్మికులకు అధిక పని స్వతంత్రం కల్పించేదిగా ఉనికిలోకి వొచ్చింది. ఇక భారతదేశంలో, అధిక సంఖ్యలో కార్మికులు తమ ప్రతిభ.. నైపుణ్యాలను ఉపయోగించుకునే అవకాశాలను కోరుకుంటున్నారు. పట్టణ యువతలో చాలా నిరుద్యోగం ఉంది ప్రజల జీవన వ్యయం పెరగడం చూస్తున్నాం. మరోవైపు విద్యార్థుల ఆకాంక్షలు పెరగడం కనిపిస్తున్నది. ఇంటిపనిలో నిమగ్నమైన మహిళల ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వొచ్చింది. ఇంటి పని కాకుండా అదనగా ఆదాయం కావాలి అంటున్నది నేటి గృహిణి. ఈ పరిస్థితిలో భారతదేశం గిగ్‌ ఎకానమీ వైపు చూస్తుంది. భారత్‌లో ఫ్రాప్‌, ఇం‌టర్న్‌షాల, ఆవిగ్న్ ‌వంటి గిగ్‌ ‌ప్లాట్‌ఫారమ్‌ల ఉనికి భారత్‌ ‌లో రోజురోజుకి పెరుగుతున్నది. ప్రస్తుతం మన దేశంలో గిగ్‌ ఎకానమీ బాగా ఎదుగుతున్నది అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. కార్మికులు చేసే పని పద్దతులను మార్చివేయటంలో గిగ్‌ ఎకానమీ పెను మార్పులు తీసుకువచ్చే ఒక చోదక శక్తి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. గిగ్‌ ఎకానమీ ఇవ్వనున్న ఉపాధి సంబంధం అనేక విధాలుగా కార్మికుల పని సాంప్రదాయలను మర్చి వేస్తున్నది. ఇక్కడ యజమాని-ఉద్యోగి అనే సంబంధం ఉండదు. గిగ్‌ ‌వర్కర్లుకు ఒకనొక ప్రత్యేక యజమాని కనిపించరు. అందువల్ల వారికి కనిపించేది. వారు ఎంచుకున్న పని. ఆపనికి వారు అంకితం చేస్తున్న పని గంటలు. తత్ఫలితంగా వారికి అందుతున్న జీతం మాత్రమే కనిపిస్తుంది. దీని వలన పరిశ్రమల అధిపతులకు తమ వ్యాపార విధులు నిర్వర్తించడానికి ఉద్యోగుల సమూహంపై ఆధారపడాల్సిన అవసరం ఉండటం లేదు.

దీని వలన అదనపు సౌకర్యాన్ని పరిశ్రమల అధిపతులు పొందుతున్నారు. గిగ్‌ ఎకానమీలో ఒక ఉద్యోగికి ఇవ్వాల్సిన సామాజిక భద్రత పరిశ్రమ అధిపతి ఇవ్వక్కర లేదు. స్థిర వేతనం ఇవ్వాల్సిన అవసరం నుంచి పరిశ్రమల అధిపతులు తప్పించుకుని చాలా ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో అనుమానమే లేదు. గిగ్‌ ఎకానమీ గురించి కడుపునిండిన వాళ్ళు ప్రశంసలు గుప్పిస్తూ మాట్లాడతారు. రోజూ పక్కాగా పని దొరకని ఒక గిగ్‌ ‌వర్కర్‌ ‌గిగ్‌ ఎకానమీ మీద మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్‌ ‌రియాలిటీని పరిశీలిస్తే చాలా సంక్లిష్టమైన అంశాలు వెలుగులోకి వొస్తున్నాయి.

గిగ్‌ ‌ప్లాట్‌ఫామ్‌ ‌వ్యాపారాలకు ప్రజాదరణ కనిపిస్తుంది. మరోవైపు క్యాబ్‌, ‌డెలివరీ సేవలలో నిమగ్నమైన కార్మికులు గిగ్‌ ‌వర్కర్స్‌గా ప్రధాన స్రవంతిలో ఉన్నారు. ఈ కార్మికులలో నిరసన అధికంగా ఉంది. భారతదేశంలో గిగ్‌ ‌వర్కర్ల గ్రీవెన్స్‌లు, ప్రధానంగా వేతనాలకు సంబంధించినవి. భారతదేశంలో గిగ్‌ ‌వర్కర్స్‌తో తక్కువ జీతంకి 8 గంటల కంటే ఎక్కువ పని చేయిస్తున్నారు. వారంలోని ఏడు రోజులు పని చేయిస్తున్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత విషయంలో జవాబుదారీ చేయలేనందున కార్మికుల జీవితాలు దుర్భరం చేసే నమూనాగా భారత్‌లో గిగ్‌ ఎకానమీ ఉంది. గిగ్‌ ఎకానమీ కార్మికుల స్థితిగతులకు సంబంధించిన అనేక ప్రశ్నలను తెరపైకి తెస్తున్నది. వీటి గురించి మరింత లోతైన అధ్యయనం చేయటం నేటి అవసరం.

Aruna journalist
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

 

Leave a Reply