Take a fresh look at your lifestyle.

సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

  • చిట్టాపూర్‌ ‌సమీపంలో వ్యవసాయ బావిలో పడ్డ కారు
  • తల్లీ కొడుకు మృతి?

సిద్ధిపేట, డిసెంబర్‌ 1 (‌ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేట జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలంలోని చిట్టాపూర్‌ ‌ప్రధాన రహదారి పక్కన అదుపు తప్పి కారు బావిలో పడింది. కారులో ఉన్న తల్లీ కొడుకు ఇద్దరూ మృతి చెందినట్లు తెలుస్తుంది.  సమాచారం అందుకున్న పలు శాఖల సిబ్బంది, పోలీసులు, ఫైర్‌ ‌సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ ‌సాయంతో కారును, అందులో ఉన్న మృతదేహాలను గజ ఈతగాళ్ల సహకారంతో తీశారు.

రామాయంపేట నుంచి సిద్దిపేట వైపు కారు వెళ్తోంది.  బావి నుంచి నీటిని అధికారులు తోడివేశారు. దాదాపు 45 నుంచి 60 లోతున బావి ఉంది. స్థానిక ఎమ్మెల్యే రఘనందన్‌ ‌రావు అక్కడికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు.  కారు బ్రేకులు ఫెయిల్‌ ‌కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

Leave a Reply