రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి.. వోటర్ల జాబితా తయారీ షెడ్యూల్ విడుదల
జీహెచ్ఎంసి ఎన్నికలను గడువులోగానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. ప్రస్తుత పాలక మండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగుస్తుందనీ, ఈ లోగానే ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈమేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం వోటర్ల జాబితా తయారీ షెడ్యూల్ను ప్రకటించింది. నవంబర్ 7న వోటర్ జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు.
11వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9న జీహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర స్థాయి ప్రతినిధులతో జీహెచ్ఎంసి కమిషనర్ సమావేశాన్ని నిర్వహిస్తారు. 10న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్కిళ్ల స్థాయిలో జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ల సమావేశం నిర్వహించి 13న వోటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.