- నోటిఫికేషన్‌తో పాటు షెడ్యూల్ విడుదల
- డిసెంబర్ 1న పోలింగ్..4న కౌంటింగ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి షెడ్యూల్‌ను నోటిషికేషన్‌తో పాటే ప్రకటించారు. బ్యాలెట్ పద్దతిలో కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తారు.
గ్రేటర్ పరిధిలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుండగా.. అసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. 4వ తేదీన ఓట్లు లెక్కింపు నిర్వహించి, ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్ విడుదలతో తక్షణమే నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు.