ఈనెల 11న జీహెచ్ఎంసీ నూతన పాలకమండలి సమావేశం, మేయర్, డిప్యూటీ మేయర్‌కు జరిగే ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిపర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఎన్నికల విభాగం అధికారులు, కార్యదర్శులతో సమావేశమైన అనంతరం కౌన్సిల్‌హాల్‌ను కలెక్టర్ పరిశీలించారు.
ఎక్స్అఫీషియో, కార్పొరేటర్లకు పార్టీల వారీగా సీట్ల కేటాయింపు, కౌన్సిల్ హాల్లోకి ప్రవేశం, మీడియా ఎన్‌క్లోజర్ తదితరాంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 11న జరిగే సమావేశాన్ని పూర్తిగా వీడియోలో చిత్రీకరించాలని ఆమె ఆదేశించారు.