Take a fresh look at your lifestyle.

‌వేడిఎక్కిన బల్దియా రాజకీయం, పట్నం ప్రజల చూపు ఎటు వైపో..?

ఈ వరుద సహాయం అందించడం అభినందించే విషయమే కానీ, ఇదే తరహాలో వర్షాలకు పల్లెలలో పంట పొలాలు దెబ్బతిని రైతు ఆవేదనలో
ఉన్నాడు ఇక్కడ కూడ నష్టమరిహరం చెల్లించ వచ్చుగా ఎందుకు ఇవ్వడంలేదు ఎందుకు మాట్లాడటం లేదు ..?  అంటే ఇక్కడ ఎన్నికలు లేవు కదా..!    ఎన్నికలు వుంటేనే మొహం చూపిస్తారా…?

పూర్వ ఎంసీహెచ్‌… ‌ప్రస్తుత జీహెచ్‌ఎం‌సీ… 65 సంవత్సరాల  రెండు సంస్థల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గడువుకు ముందే ఎన్నికలు జరగునున్నాయి. పాలకమండలి గడువు ముగిసి… నెలలు, ఏళ్ల తరబడి ప్రత్యేక అధికారి పాలన కొనసాగిన అనంతరం గతంలో ఎన్నికలు నిర్వహించినారు,  ఇప్పుడు అందుకు భిన్నంగా పాలకమండలి పదవీ కాలం ఉండగానే ఎన్నికల కసరత్తు మొదలైంది. ఇదంతా చట్టంలోని వెసులుబాటు ఆధారంగానే అయినప్పటికీ..  బల్దియా  ముందస్తు ఎన్నికలు కొత్తగా అనిపిస్తునాయి…..  

ఈ వరుద సహాయం అందించడం అభినందించే విషయమే కానీ, ఇదే తరహాలో వర్షాలకు పల్లెలలో పంట పొలాలు దెబ్బతిని రైతు ఆవేదనలో ఉన్నాడు ఇక్కడ కూడ నష్టమరిహరం చెల్లించ వచ్చుగా ఎందుకు ఇవ్వడంలేదు ఎందుకు మాట్లాడటం లేదు ..?  అంటే ఇక్కడ ఎన్నికలు లేవు కదా..!    ఎన్నికలు వుంటేనే మొహం చూపిస్తారా…?
బల్దియాలో ఉన్న 150 డివిజన్లకుగాను 99 డివిజన్లలో అధికార తెరాస పార్టీ ఘనవిజయం సాధించింది.

ఈసారి కూడా కాస్త అటుఇటుగా స్థానాలు సాధిస్తామన్న ధీమాలో ఈ పార్టీ అగ్రనేతలున్నారు. అయితే మహానగరాన్ని ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తడంతో వేలాది కాలనీలు ముంపు బారినపడ్డాయి. పరిస్థితి ఎంతదారుణంగా మారిదంటే ఇన్ని రోజులైనా ఇంకా అనేక కాలనీలు ముంపులోనే ఉన్నాయి. బాధితులకు తోడ్పాటు అందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రూ.550 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారు. ఈ పంపిణీలో అవకతవకలు జరగడంతో కొద్దిరోజులు ఆ పంపిణీని నిలిపివేసి తాజాగా అర్హులందరికీ పంపిణీ చేయడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనాలనుకుంది. ముంపు పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ఈ  ఎన్నికలలో  సర్కార్‌  ‌సరిఅయిన ఫలితం పొందాలి అని చూస్తున్నారు.
ముఖ్యంగా గ్రేటర్‌?‌లోని 150 డివిజన్లలో ఇండ్లు లేని ప్రతి ఒక్కరికీ డబుల్‌ ‌బెడ్రూమ్‌ ?ఇం‌డ్లు ఇస్తామని మంత్రులతోపాటు కార్పొరేట్‌? అభ్యర్థులు చెప్పారు. అప్పట్లో లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. నిర్మాణాలు మాత్రం వందల్లో చేపట్టి, అక్కడక్కడా లబ్ధిదారులకు అందించారు. చాలావరకు ఇండ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆ పనులు త్వరగా పూర్తిచేసి మరికొంతమందికి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా వారికి ఎన్నికల అనంతరం ఇస్తామని చెప్పి ఎన్నికలకలో ముందుకి  వెళ్లాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉంది. ఇచ్చిన పరిహారం కూడా అపహాస్యం పాలైంది. అధికార పార్టీ నేతలు సూచించినవారికి మాత్రమే చాలా చోట్ల వరద సాయం అందిందని ప్రజలు  ఆరోపించారు. నిజమైన బాధితులను విస్మరించి విమర్శలపాలయ్యారని పట్నం ప్రజల నోట . బల్దియా ఎన్నికల సమయం దెగ్గర  ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వరద బాధితుల్ని మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి, మభ్యపెడుతున్నారు. పట్నంలో విద్యావంతులు అధికంగా వుంటారు అని మాట మరి ఎంలాభం ఎంతమంది వుంటే సరి అయిన అభ్యర్దిని ఎన్నుకొలేని వారు, ఎన్నికలకు దూరంగా వుండి అభివృద్ధి కావాలి అంటే ఎక్కడనుండి వస్తది విరి కంటే బస్తి వాసులే పోలింగికు హాజరు అవ్తున్నారు.   ఇంట్లో   కూర్చొని బోలెడన్ని మాటలు చెప్పేవారు .. ఎన్నికల వేళ కీలకమైన పోలింగ్‌ ‌బూత్‌ ‌కు వెళ్లి ఓటు వేసే విషయంలో ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉరంతా ఒక దారైతే. ఉలిపికట్టది మరో దారి అన్న చందంగా.  ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా.. పోలింగ్‌ ‌శాతం ఎలా ఉన్నా.. హైదరాబాద్‌ ‌మహానగరంలో మాత్రం పోలింగ్‌ ‌శాతం తక్కువగా ఉండటం చూస్తుంటాం. ఎందుకో మరి ఇలా…?  చాలానే కారణాలు చూపిస్తారు. మహానగర వాసులకు ఓటు వేసే విషయంలో వ్యవహరించే నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. దీన్ని అధిగమించేందుకు ఎన్నికల సంఘమే సవరించి  కొత్త విధానాల్ని అందుబాటులోకి తేవాలి ఏమో…?

గత గ్రేటర్‌ ఎన్నికల్లో 2009లో 42.92% ఓటింగ్‌ ‌నమోదు అయింది, 2016 లో 45.27% ఓటింగ్‌ ‌నమోదు అయింది ..విద్యావంతులు అత్యధికంగా ఓటింగ్‌ ‌లో పాల్గొని సరి అయిన అభ్యర్దిని ఎన్నుకోండి.
మేయర్‌ ‌జనరల్‌ ‌మహిళ
మేయరు పదవి జనరల్‌ ‌మహిళకు రిజర్వ్ అయింది. మొత్తం వార్డుల్లో 50 బీసీలకు, 44 జనరల్‌ ‌మహిళ, మరో 44 జనరల్‌, ఎస్సీలకు పది, ఎస్టీలకు రెండు వార్డులు కేటాయించారు,  ఏ మహిళ వరించనుందో పట్నం పీఠం……కీలకంగా మారే ఎక్స్ అఫిషియో ఓట్లు. తెరాస 41 డివిజన్లు గెలిస్తే చాలు తెరాస ఎక్స్ అఫిషియో ఓట్లు.35  ఎఐఎంఐఎం కు10 , మొత్తం 45 అయితాయి తెరాస 31 గెలిచిన మేయర్‌ ‌దక్కడం కాయం, మ్యాజిక్‌ ‌ఫిగర్‌ 76, ‌దుబ్బాక ఫలితాలు బల్దియా మీద ప్రభావం చూపిస్తాయ అంటే బరాబర్‌ ‌చూపిస్తాయి. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్‌ ‌పార్టీ భావిస్తూ. ఈ ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోకున్నా..గతంలో కంటే మెరుగైన సీట్లు  సాధించేందుకు నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కజ్‌గిరి పార్లమెంట్‌ ‌నియోజకవర్గం పరిధిలో ఆపార్టీ మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది.

image.png
జాజుల దినేష్‌ , ఎంఏ. (‌బీఈడీ) సెట్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయం
9666238266

Leave a Reply