Take a fresh look at your lifestyle.

బ్యాలెట్‌ ‌పద్దతిలోనే జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం
బ్యాలెట్‌ వోటింగ్‌కు 23 పార్టీల మొగ్గు

‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జీహెచ్‌ఎం‌సి) ఎన్నికలను బ్యాలెట్‌ ‌పద్దతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసి) నిర్ణయించింది. కొరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎం‌సి ఎన్నికలను ఏ విధంగా నిర్వహంచాలనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఈవీఎంలో నిర్వహించాలా ? లేక బ్యాలెట్‌ ‌పద్దతిలోనా అనే అంశంపై ఎన్‌ఈసి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభిప్రాయం కోరింది. ఈ అంశంపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రంలో గుర్తింపు పొందిన 50 రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.  అయితే, ఎన్నికల సంఘం రాసిన లేఖకు స్పందిస్తూ 26 పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపారు.

వీటిలో 23 పార్టీలు బ్యాలెట్‌ ‌పద్దతిలో ఎన్నికలకు మొగ్గు చూపగా, 3 పార్టీలు మాత్రం ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో కోవిడ్‌ ‌నేపథ్యంలో మెజార్టీ పార్టీల అభిప్రాయం మేరకు బ్యాలెట్‌ ‌పద్దతిలోనే జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే, మున్సిపల్‌ ఎన్నికలు కూడా బ్యాలెట్‌ ‌పద్దతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. మెజార్టీ పార్టీల అభిప్రాయం మేరకే బ్యాలెట్‌ ‌ద్వారా ఎన్నికల నిర్వహణ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఈసి ప్రకటించింది. మరోవైపు, ఎన్నికలను ఏ పద్దతిలో నిర్వహించాలో అభిప్రాయం చెప్పాలని ఎస్‌ఈసి జీహెచ్‌ఎం‌సికి లేఖ రాసింది. దీనికి స్పందనగా ఏ విధానంలో వెళ్లినా తమకు అభ్యంతరం లేదనీ, ఏర్పాట్లు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. అన్ని విధాలుగా బ్యాలెట్‌కే అనుకూలంగా ఉంటుందని మొగ్గు చూపడంతో అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply