Take a fresh look at your lifestyle.

ఘణపురం బ్రాంచ్‌ ‌కెనాల్‌ ‌పనులను వేగవంతం చేయాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి,మే,06(ప్రజాతంత్ర విలేకరి) : వనపర్తి జిల్లా ఖిలా ఘణపురం మండలం ఘణపురం బ్రాంచ్‌ ‌కెనాల్‌ ‌పై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పర్యటించి పెండింగ్‌ ‌పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలిచ్చా రు. బుధవారం నాడు మంత్రి నిరంజన్‌రెడ్డి ఘణపురం బ్రాంచ్‌ ‌కెనాల్‌ ‌పనులను కాలువల వెంబడి తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు మామిడి మాడ పర్వతాపుర్‌, అల్లమాయపల్లి అప్పారెడ్డి పల్లి, షాపూర్‌, ‌ఘణపురం, మానాజిపేట, కాలువ పనులను పరిశీలించిన అనంతరం పెండింగ్‌ ‌పనుల పూర్తికి అధికారులకు ఆదేశాలిస్తు వానాకాలంలో కాలువ పరిధిలో ఉన్న ప్రతి చెరువు నింపాలని అధికారులకు ఆదేశించారు. కాంట్రాక్టర్లు పట్టించుకోకుండా కొత్తవాలతో పనిచేయించాలని ప్రణాళిక ప్రకారం చెరువులు నింపేందుకు నివేదిక సిద్దంచేయాలన్నారు.

మామిడి మాడ రిజర్వాయర్‌ ‌పనులు వెంటనే పూర్తి చేయలని ఘణపురం బ్రాంచ్‌ ‌కెనాల్‌ ‌నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా మంగనూరు నుండి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోని అడ్డాకుల వరకు పనులన్ని పూర్తి కావాలని చెప్పారు. పనుల్లో జాప్యం జరిగితే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని అన్నారు. ఒక్కపని ఆగిపోయిన రైతులు ఒక పంటమొత్తం నష్టపోతారని అందుకు తగ్గట్లు పనులు వేగవంతకం చేయాలని చెప్పారు.

Leave a Reply