Take a fresh look at your lifestyle.

కార్మికులకు అండగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ :చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం

వరంగల్‌ ‌పశ్చిమ నియోజకవర్గంలోని బాల సముద్రం 38వ డివిజన్‌లో వడ్డెర కాలనీ, శ్రీనివాస నగర్‌, ‌మల్లికాంబ మనోవికాస కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇంటింటికి తిరిగి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.ఈసందర్భంగా చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ ‌మాట్లాడుతూ కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకుండా సిఎం నాయకత్వంలోని తెలంగా ణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ఉందన్నారు. పేద ప్రజల, కార్మికుల పక్షపాతి అని, కార్మికుల కష్టాల ను తీర్చడానికి ముఖ్య మంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.దాదాపు 50రోజులుగా లాక్‌ ‌డౌన్‌ ‌మూలంగా అనేక మం ది అసంఘటిత రంగ కార్మికులు తమ జీవనో పాధి కోల్పోయి ఇబ్బందు లు పడుతున్నారని అన్నారు.టిఆర్‌ఎస్‌ ‌పార్టీ స్థాపించి 20 సంవత్స రాలు అవుతున్న సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌స్ఫూర్తితో నియోజకవర్గం లోని 20వేల కుటుం బాలకు‘ఫీడ్‌ ‌దా నీడ్‌’ ‌పేరుతో నిత్యావసర సామ గ్రి,బియ్యం అందజేయడం జరుగుతోందన్నారు.

మలబార్‌ ‌గోల్డ్ ‌డైమండ్స్ ఆధ్వర్యంలో
అనంతరం మలబార్‌ ‌గోల్డ్ అం‌డ్‌ ‌డైమండ్స్ ‌సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ ‌మాట్లాడుతూ లాక్‌ ‌డౌన్‌ ‌మూలంగా అనేక మంది అసంఘటిత రంగ కార్మికులు తమ జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నార న్నారు. వారి ఇబ్బందులను గమనించి మలబార్‌ ‌గోల్డ్ అం‌డ్‌ ‌డైమండ్స్ ‌సంస్థ వారు 300 మంది నిరుపేదలకు నిత్యావసర సామగ్రి అందజేయడం కోసం ముందుకు రావడం అభినందనియ మన్నారు. మరింత మంది దాతలు, సంస్థలు ముందుకు వచ్చి ఈ కష్ట కాలంలో కార్మికులను ఆదుకొని, అండగా ఉండాలని కోరారు. నిత్యావసర వస్తువులు అందించిన మలబార్‌ ‌షోరూమ్‌ ‌ప్రతినిధులను అభినందించారు. అనేక మంది కి ఉచితం గా కూరగాయలను అందజేసి తన ఉదారత ను చాటిన కూరగా యల వ్యాపారి సత్యం, ఎంఎస్‌ ‌రావులను అభినందించారు.మలబార్‌ ‌గోల్డ్ ‌షోరూం ఇంచార్జి శ్రీనివాస్‌ ‌మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తి విస్తరిస్తున్న ఈ తరుణంలో తమ కంపెనీ సామాజిక బాధ్యతగా సిఎం సహాయనిధికి రూ.కోటి అందజేశామన్నారు. అదే క్రమంలోతమ షోరూమ్‌లు ఉన్న ప్రాంతా ల్లో రూ.రెండు లక్షల నిధులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ ‌నాయకులు నరెడ్ల శ్రీధర్‌, ఉదిత్‌, ‌ప్రణయ్‌,అశోక్‌, ‌శ్రీనివాస్‌, ‌మల బార్‌ ‌గోల్డ్ అం‌డ్‌ ‌డైమండ్స్ ‌సంస్థ అసిస్టెంట్‌ ‌హెడ్‌కురియన్‌, ‌సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply