Take a fresh look at your lifestyle.

కరోన వైరస్‌ను తరిమి కొట్టండి : సీతక్క

రాష్ట్రంలో కరోనా మహమ్మారీ విజృంబిస్తున్న ప్రస్థుత సమయంలో ప్రజలందరు సామాజిక దూరం,స్వీయ గృహ నిర్భందం పాటించి కరోనా మహమ్మారీని తరిమి కోట్టాలని ములుగు ఎమ్మేల్యే సీతక్క అన్నారు. సోమవారం జిల్లాలోని వెంకటాపూర్‌ ‌మండలం భూర్గుపేట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 100 మంది నిరుపేదలకు,పోర్కలపల్లి,అనందపూర్‌ ‌గ్రామాలకు చెందిన 180 మంది నిరుపేదలకు, అశ్వారావుపేట మండలం గుండ్ల మడుగు గ్రామంలోని ఎడమ వారి గుంపు,గోంది మడుగు గోత్తికోయగూడెం గ్రామాలకు చెందిన 46 మంది నిరుపేద కుటుంబాల వారికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

అనంతరం ఇటీవల మృతి చెందిన వెంకటాపూర్‌ ‌మండలంలోని అనందపూర్‌ ‌గ్రామానికి చెందిన మేకల రాజే•,•లక్ష్మిందేవిపేట గ్రామానికి చెందిన కర్నే సత్యనారాయణ  కుటుంబాన్ని పరమార్శించి వారికి అర్ధిక సహయం క్రింద 25 కేజీల బియ్యం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు నల్లేల కుమారస్వామి, మండల అద్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ,  వర్కింగ్‌ ‌కమిటి అద్యక్షులు బండి శ్రీనివాస్‌,‌స్థానిక సర్పంచ్‌ ‌చేద సారంగం, ఎంపిటిసిలు జంగిలి రవి, బానోత్‌ ‌భాస్కర్‌,‌కోట అంజయ్య, సహకార సంఘం డైరెక్టర్‌ ‌గంద్రకోట మధుకర్‌,‌యువజన నాయకులు సిద్దం రాఘవేంద్ర, తోట సాంబయ్య తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply