Take a fresh look at your lifestyle.

12‌న ధర్నాలకు సిద్దం కండి

పార్టీ శ్రేణులకు కెటిఆర్‌ ‌పిలుపు
ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నాకు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకుగాను టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో.. ధర్నాలకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. ఎక్కడిక్కడ నిరసనలకు దిగాలని అన్నారు. ఈ మేరకు జిల్లాల్లో పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నాకు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
కెసిఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ధర్నా కార్యక్రమాలను చేపట్టనున్నారు. అందులో భాగంగా బుధవారం ఇందిరా పార్కు వద్ద మంత్రులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..బీజేపీ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారు. వారికి మద్దతుగా హైదరాబాద్‌ ఇం‌దిరా పార్క్ ‌వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నదని తెలిపారు.

Leave a Reply