Take a fresh look at your lifestyle.

జీఓ 203 ను రద్దు చేయించాలి: టిడిపి

నాగర్‌ ‌కర్నూల్‌, ‌మే 18.ప్రజాతంత్రవిలేకరి: పోతిరెడ్డిపాడు విషయంలో ఏ.పి.ప్రభుత్వం జారీ చేసిన 203 జీఓను తెలంగాణ ప్రభు త్వం రద్దు చేయించాలని, దీనిపై అధికార పార్టీ ఎంఎల్‌ఏలు స్పందించాలని తెలుగు దేశం పార్టీ నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా అధికార ప్రతినిధి రమేష్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజాతంత్ర ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు కారణమే నీళ్లు,నిధులు, నియామకాల కోరకై ప్రాణలను పన్నంగ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నదని అన్నారు.

దక్షిణతెలంగాణ లోని ఉమ్మడి పాలమూరు జిల్లాను నాశనం చేయడమే టీఆర్‌ఎస్‌ ‌లక్ష్యంగా పెట్టుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తే పాలమూరు జిల్లా ఎడారిఅవుతుందన్నారు. టిడిపి హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్ ‌లను పూర్తి చేయాలని పార్టీ తరఫున డిమాండ్‌ ‌చేస్తున్నామని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply