Take a fresh look at your lifestyle.

గజల్‌

‌చెట్టు ఎదిగి ప్రాణగాలి ఇస్తున్నది మనకే కద
పంటపండి ఆకలిని తీర్చుతున్నది మనకే కద

ప్రాణికోటి మనుగడలో మరువకు వనసంరక్షణ
చదువువల్ల జ్ఞానమే కలుగుతున్నది మనకేకద

రైతుశ్రమను పీల్చెటోని అడ్డుతొలగె రోజెన్నడు
పనికి పోయి కూలినాలి చేస్తున్నది మనకే కద

పల్లెలోని కాంతులన్ని పట్టణాలకు వలసపోయె
కలలు కన్న మంచి రోజు వస్తున్నది మనకే కద

నీతి లేని ఈ పాలన మనకెందుకు కట్టెకోల
కొవ్వొత్తి కరిగిపోయి వెలుగుతున్నది మనకే కద

                         – కట్టెకోల చిన నరసయ్య
                                         7981814784

Leave a Reply