Take a fresh look at your lifestyle.

త్రిముర్త్యాంశగా గాయత్రీ దేవి ఇం‌ద్రకీలాద్రిలో నవరాత్రి సందడి

వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యా వందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయత్రీ దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు ’దశహరా’కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిస లాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.

దుర్గమ్మకు కనకపుష్యరాగ హారం బహుకరణశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీగాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్‌ ‌నిబంధనలను పాటిస్తూ అమ్మ దర్శనంకై భక్తులు తరలివచ్చారు. కాగా అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడిన విజయవాడకు చెందిన తాతినేని శ్రీనివాస్‌ ‌లీలా దంపతులు సోమవారం 40 లక్షల రూపాయల విలువ కలిగిన కనకపుష్య హారాన్ని దుర్గమ్మకు బహూకరించారు. ఇది తమ పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఏడువారాల నగల విశిష్టతను ఆలయ అర్చకులు శాండల్య వివరిస్తూ వారంలో ఏడు రోజులు ప్రతిరోజు ఆయా గ్రహాల అధిపతుల ఆధారంగా గత ఆరు నెలల నుండి ఏడువారాల నగలను అమ్మవారికి అలంకరించడం జరుగుతుందన్నారు. ఆలయ ఈవో యం.వి.సురేష్‌ ‌బాబు మాట్లాడుతూ ఏడువారాల నగలు చేయించేందుకు ముందుకు వచ్చే దాతలు తమను ముందుగా సంప్రదిస్తే వివరాలు తెలుపుతామన్నారు.

Leave a Reply