Take a fresh look at your lifestyle.

కొరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో ముందు స్థానంలో భారత్‌

భారత పరిషోధనలు కీలకం
గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌సహవ్యవస్థాపకులు బిల్‌గేట్స్

‌కొరోనా వ్యాక్సిన్‌ ‌తయారీలో భారత్‌ ‌కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని మైక్రోసాప్ట్ అధినేత, బిల్‌ అం‌డ్‌ ‌గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌సహవ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అన్నారు. భారత్‌ ‌పరిశోధనలే ఇప్పుడు కీలకంగా మారాయని మంగళవారం తెలిపారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌ ‌ముందు స్థానంలో ఉందన్నారు.  వ్యాక్సిన్‌ ‌తయారీలో మనందరికి భారత్‌ ‌సహకారం అవసరం అని కూడా చెప్పారు. వచ్చే ఏడాది భారత్‌ ‌నుంచి భారీ స్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావొచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం
నాటికి కొరోనా వైరస్‌కు సంబంధించిన వివిధ వ్యాక్సిన్లు చివరి దశకు చేరుకుంటాయని తాను ఆశిస్తున్నానని, భారత్‌లో తయారవుతున్న వ్యాక్సిన్‌ ‌సురక్షిత మైనదని తెలిస్తే.. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ ‌పొందాలని మనమందరం కోరుకుంటున్నామని బిల్‌గేట్స్ అన్నారు.

వ్యాక్సిన్‌ ‌తయారీలో కీలకపాత్ర పోషించడానికి భారత్‌ అం‌గీకరించడం.. అదే సమయంలో ఈ వ్యాక్సిన్లను అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపడం క్లిష్టమైన అంశమన్నారు. ఇక భారత్‌లోని ఫార్మా ఇండస్ట్రీ సామర్థ్యం గురించి బిల్‌గేట్స్ ‌స్పందిస్తూ.. భారత్‌లోని ఫార్మా ఇండస్టీ భారత్‌తో పాటు ప్రపంచం మొత్తానికి కొరోనా వ్యాక్సిన్‌ ‌తయారు చేయగలదని పేర్కొన్నారు. భారత్‌లోని డ్రగ్‌, ‌వ్యాక్సిన్‌ ‌కంపెనీలు ప్రపంచం మొత్తానికి ఎగుమతుదారులుగా ఉన్నాయన్నారు. ప్రపంచదేశాలన్నిటిలో అత్యధిక వ్యాక్సిన్లు భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ‌భారత్‌ ‌బయోటెక్‌, ‌బయో-ఈ తదితర కంపెనీలు వ్యాక్సిన్‌ ‌తయారీకి సహాయసహకారాలు అందిస్తున్నాయన్నారు. ప్రస్తుతం కొరోనా మరణాలను తగ్గిస్తూ.. ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ ఉండేలా చూసుకోవడమే అందరి ముందున్న లక్ష్యమన్నారు. కాగా.. భారత్‌కు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‌భారీ స్థాయిలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!