Take a fresh look at your lifestyle.

గ్యాస్‌ ‌సబ్సిడీకి మంగళం పాడే దిశగా అడుగులు

వేయికి చేరువయ్యేలా ధరల తీరు
దేశంలో పెట్రో ధరలతో పాటు గ్యాస్‌ ‌సబ్సిడీని మెల్లగా  తగ్గించేస్తున్నారు. దీంతో నెలనెలా సిలిండర్‌ ‌ధర పెంచేస్తున్నారు. గడిచిన 12 రోజుల్లోనే సిలిండర్‌పై రెండుసార్లు ధర పెంచారు. ఈ నెల 3న 25 రూపాయలు పెంచితే.. 15న మరో 50 రూపాయలు పెంచారు. దీంతో సిలిండర్ల వినియోగదారులపై రూ.75 భారం పడింది. కమర్షియల్‌ ‌సిలెండర్‌పై రూ. 100 పెంచారు. సబ్సిడీ సిలిండర్‌ ఉపయోగించే వినియోగదారులపై నెలనెలా భారం పడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వంట గ్యాస్‌ ‌ధరలు, మరోవైపు సబ్సిడీ కుదింపుతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు, పెట్రో ధరలు పెంచడం చూస్తుంటే సిలిండర్‌ ‌ధర వేయికి చేరుకుంటుందని అంటున్నారు.  ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్‌ ‌ధర గత నెలలో రూ. 765 ఉండగా ఈ సారి రూ. 840కు చేరుకుంది. కమర్షియల్‌ ‌సిలిండర్‌ ‌కూడా రూ. 1,615 నుంచి 1,718కు చేరుకుంది. సబ్సిడీ సిలిండర్లపై రూ. 75 పెరగడంతో దీని ప్రకారం పెరిగిన సిలిండర్‌ ‌ధర ప్రకారం రూ. 28.85 లక్షల భారం పడింది.

సబ్సిడీ ఖాతాల్లో ఎంత జమ అవుతుందో తెలియకపోగా కొందరి ఖాతాల్లో జమ అవుతున్న తీరు చూస్తే అశ్చర్య పరుస్తుంది. గత సంవత్సరం మార్చిలో సబ్సిడీ సిలిండర్‌ ‌ధర రూ . 880 ఉండగా సబ్సిడీ రూ. 348 ఖాతాల్లో జమ అయ్యింది. ఏప్రిల్‌ ‌మాసంలో రూ. 816 సిలిండర్‌ ‌ధర ఉండగా రూ. 213 ఖాతాల్లో జమ అయ్యింది. మే మాసం నుంచి సబ్సిడీ ఒక్కసారిగా పడిపోయింది. రూ. 602 సిలెండర్‌ ‌ధర ఉండగా రూ 45.88 రూపాయలు జమ చేశారు. ప్రస్తుతం సిలిండర్‌ ‌రూ. 840 ఉండగా సబ్సిడీ రూ 46.80 రూపాయలు జమ చేస్తున్నారు. మే మాసం నుంచి సబ్సిడీ రూ. 50 లోపే జమ చేస్తూ వస్తున్నారు. ప్రతినెలా రెండు సార్లు సిలిండర్‌ ‌ధరలను పెంచుతూ వొస్తున్నారు. దీంతో గ్యాస్‌ను కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. గ్యాస్‌, ‌పెట్రోల్‌ ‌ధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపడుతున్నారు. ప్రతిరోజు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు కొనసాగుతున్నాయి. మండలాల్లో వినూత్న రీతిలో ధరల పెరుగుదలపై నిరసనలు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు సామాన్యులు సిలిండర్‌ ఉపయోగించాలంటేనే ఇబ్బంది పడుతూ ఎలక్ట్రికల్‌ ‌స్టౌలు, రైస్‌కుక్కర్‌లను ఉపయోగిస్తున్నారు.

Leave a Reply