రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 28: ఖమ్మం ఈగల్ టీమ్, రాచకొండ పోలీసులు జరిపిన తనిఖీలలో భారీగా గంజాయి పట్టుబడిరది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద 935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రాజమండ్రి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని 455 ప్యాకెట్లుగా చేసి పండ్ల ట్రేలల్లో ఉంచి డీసీఎంలో తరలిస్తున్నట్లు వెల్లడిరచారు. ముగ్గురు అంతర్‌రాష్ట్ర నిందితులను అరెస్టు చేసినట్లు, దీని విలువ రూ.5 కోట్లు ఉంటుందని తెలిపారు.
భారీగా గంజాయి పట్టివేత



