Take a fresh look at your lifestyle.

రాజకీయాలు చేస్తావా? పూజారి తనం చేస్తావో తెలుసుకో

హిందూ సమాజం అభివృద్ధి కోసం పాటుపడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌కుమార్‌ ‌వంటి సీనియర్‌ ‌నేతలను విమర్శిస్తూ రాజకీయాలు చేస్తావా? గుడి పూజారి  తనం చేస్తావో తెలుసుకో అని వెయ్యి స్తంభాల గుడి ప్రధాన అర్చకుడు, అర్చక సమైఖ్య నేత గంగు ఉపేంద్రశర్మ కు బిజెపి వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హితవు పలికారు. బండి సంజయ్‌పై ఉపేంద్రశర్మ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు   ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంజయ్‌ని విమర్శించి హిందూ వ్యతిరేక శక్తులకు భజన చేయడం ఒక పూజరి లక్షణం కాదని హితవు పలికారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ‘అంటొనియా మైనో అలియాస్‌ ‌సోనియా గాంధీ’ కొరకు యజ్ఞం చేసి, రప్తార్‌గా ఇఫ్తార్‌ ‌విందు అరగించె గంగు ఉపేంద్రశర్మ గత చరిత్ర ఎంటో ప్రజలందరికి తెలుసునన్నారు. శర్మ గారు తమరి గతం ఏమిటో, ఘనకార్యాలేమిటో యాది తెచ్చుకొవాలని గుర్తు చేశారు.

ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన కోట్టె శర్మ రామ మందిరం కట్టించడం కోసం ఉద్యమం చేసిన బిజెపికి సారథ్యం వహిస్తున్న సంజయ్‌ని విమర్శించే అర్హత లేదని తెలిపారు. ఒక పూజారిని నిర్దాక్షిణ్యంగా చంపితె మాట్లాడడం రాని గంగు ఉపేంద్ర శర్మ  ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడడంలోని అంతర్యమేమిటని ప్రశ్నించారు. గంగు రాజకీయాలు చేస్తావా? పూజారి తనం చేస్తావో తెలుసుకో అని హితవు పలికారు. హిందు సమాజానికి చేసిన సేవలేమిటో అందరికి తెలుసునని, వరంగల్‌లో పూజారి చనిపోయినప్పుడు మీ పెద్దరికాన్ని  ఏడ తాకట్టు పెట్టావాని గంగును ప్రశ్నించారు. నిర్బంధాన్ని ఎదిరించి పూజారి పాడే మోసి హిందుత్వం పట్ల తనకున్న చిత్తశుద్ధిని చూపిం చిన సంజయ్‌ని విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.   పవిత్రమైన దేవాలయాలను అపవిత్రం చేస్తున్న ఇలాంటి దొంగ పూజారులపై దేవాదాయ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. గంగు ఉపేంద్ర శర్మ వెంటనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బేషరతుగా క్షమాపణ చెప్పాలని రావు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply