Take a fresh look at your lifestyle.

ప్రకాశంలో కొలువుదీరిన కొత్త కార్యవర్గాలు

ఒంగోలు మేయర్‌గా గంగాడ సుజాత ప్రమాణం
‌ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, అద్దంకి, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి నగర పంచాయతీలకు మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌, ‌చైర్మన్లు, వైస్‌ ‌చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యింది. ఒంగోలు కార్పొరేషన్‌ ‌మేయర్‌గా గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ (బుజ్జి) ప్రమాణ స్వీకారం చేశారు. చీరాల మునిసిపాలిటీ చైర్మన్‌గా జంజనం శ్రీనివాసరావు, డిప్యూటీ చైర్మన్‌గా జైసన్‌ ‌బాబు ప్రమాణ స్వీకారం చేశారు. మార్కాపురం మునిసిపాలిటీ చైర్మన్‌గా చిల్లంచెల్ల బాల మురళీకృష్ణ, వైస్‌ ‌చైర్మన్‌గా ఇస్మాయిల్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు.

గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్‌గా పావుల వెంకట సుబ్బయ్య, వైస్‌ ‌చైర్మన్‌గా ఆర్డీ రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. అద్దంకి నగర చైర్మన్‌గా లక్కుబోయిన ఎస్తేరమ్మ, డిప్యూటీ చైర్మన్‌గా దేసు పద్మేష్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు. చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్‌గా చల్లా అంకులు, డిప్యూటీ చైర్మన్‌గా వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కనిగిరి నగర పంచాయతీ చైర్మన్‌గా షేక్‌ అబ్దుల్‌ ‌గఫార్‌, ‌డిప్యూటీ చైర్మన్‌గా పులి శాంతి ప్రమాణ స్వీకారం చేశారు.

Leave a Reply