Take a fresh look at your lifestyle.

‌ప్రశాంతంగా ముగిసిన గణేష్‌ ‌శోభాయాత్ర..నిమజ్జనం

ఊపిరి పీల్చుకున్న ఉన్నతాధికారులు

హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గణేష్‌ ‌శోభాయాత్ర..నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిసాయి. హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర సోమవారం తెల్లవారుజాము వరకూ హుస్సేన్‌ ‌సాగర్‌లో గణేష్‌ ‌విగ్రహాల నిమజ్జనంతో ముగిసింది. వేల సంఖ్యలో భక్తులు తరలి వొచ్చారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగక పోవడంతో పోలీసులు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంక్‌బండ్‌పై గణేష్‌ ‌నిమజ్జనాలకు సుప్రీమ్‌ ‌కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో జంటనగరాల్లో వేల సంఖ్యలో ఏర్పాటుచేసిన గణేష్‌ ‌మండపాలలో గణేష్‌లు ఎక్కువ శాతం ఆఖరు రోజు ఆదివారం నిమజ్జనానికి ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు తరలించారు.

పోలీసులు, జీహెచ్‌ఎం‌సి, వాటర్బోర్డు, విద్యుత్‌, ఆర్‌అం‌డ్‌బి, హుడా, తదితర శాఖలు సమన్వయంతో వ్యవహరించడం వల్ల నిమజ్జన వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా పూర్తిచేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అన్నారు. ప్రత్యేకించి  జీహెచ్‌ఎం‌సి, పోలీసు, ట్రాఫిక్‌ ‌పోలీసు, ఎలెక్ట్రికల్‌, ఆర్‌ అం‌డ్‌ ‌బి, వాటర్‌ ‌వర్కస్, ‌రెవెన్యు, అగ్నిమాపక శాఖ తదితర శాఖల అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించిన భాగ్యనగర్‌ ‌గణేష్‌ ఉత్సవ కమిటీ, ఉత్సవ మండపాల నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

 

Leave a Reply