Take a fresh look at your lifestyle.

సెప్టెంబర్‌ 10‌నుంచి గణేష్‌ ‌నవరాత్రి ఉత్సవాలు

40 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మాణం
విగ్రహ నమూనాను ఆవిష్కరించి వివరించిన ఉత్సవసమితి
ఈ ఏడాది గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు నిర్వాహకులు సన్నద్దం అవుతున్నారు. గత రెండేళ్లుగా కొరోనాతో గణేష్‌ ఉత్సవాలు బోసి పోయాయి. దీంతో ఈ యేడు థర్డ్‌వేవ్‌ ‌హెచ్చరికల నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఉత్సవాలను నిర్వహిస్తామని భాగ్యనగర్‌ ‌గణేష్‌ ఉత్సవ్‌ ‌సమితి జనరల్‌ ‌సెక్రెటరీ భగవంత రావు తెలిపారు. ఈ నెల 23న భాగ్యనగర్‌ ‌గణేష్‌ ఉత్సవ్‌ ‌సమితి ఆఫీస్‌ ఓపెన్‌ ‌చేస్తామని చెప్పారు. సెప్టెంబర్‌ 10‌న ఉత్సవాలు ప్రారంభమవుతాయని…19 ఆదివారం నిమిజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ ‌చేస్తున్నామని, రా మెటీరియల్‌ ‌టైమ్‌కి ఇవ్వాలని కోరుతున్నామని ఆయన అన్నారు. గణేష్‌ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్‌ ‌ప్లాంట్స్ ఉపయోగిస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎం‌సీ రోడ్లు బాగు చేయాలని.. నిమజ్జనమ్‌ ‌సమయానికి బాగా ఉండేలా చేయాలని వినతి చేశారు. తాగు నీరు కూడా ఉండేలా చూడాలన్నారు.

40 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మాణం…విగ్రహ నమూనాను ఆవిష్కరించి వివరించిన ఉత్సవసమితి
ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌విగ్రహ నమూనాను ఉత్సవ సమితి శనివారం విడుదల చేసింది. శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌భక్తులకు దర్శనమిస్తారు. 40 అడుగుల ఎత్తులో ఈ ఏడాది గణనాథుడు కొలువుదీరనున్నారు. ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌కుడి వైపున 15 అడుగుల ఎత్తులో కృష్ణ కాళీ విగ్రహాన్ని, ఎడమ వైపున 15 అడుగుల ఎత్తులో కాల నాగేశ్వరి విగ్రహాల ఏర్పాటు చేయనున్నారు. అయితే ఖైరతాబాద్‌ ‌మహాగణపతి కమిటీ సభ్యుల్లో సమన్వయలోపం కనిపించింది. కమిటీ సభ్యులు అందరికి ఆహ్వానం అందలేదంటూ కొందర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ నమూనా ఆవిష్కరణను సభ్యులు అడ్డుకున్నారు. దీంతో నమూనా విడుదలలో జాప్యం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గణేష్‌ ‌విగ్రహాలలో ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌విగ్రహం ఒకటి. పది రోజుల పాటు కొనసాగే చతుర్థి వేడుకల్లో వేలాది మంది భక్తులు ఖైరతాబాద్‌ ‌గణేషుడిని దర్శించుకుంటారు. గతేడాది కొవిడ్‌-19 ‌మహమ్మారి కారణంగా విగ్రహం ఎత్తు 9 అడుగులకే పరిమితం చేయబడింది. అంతకుక్రితం 2019లో 61 అడుగులుగా ఉంది.

కాగా ఈ ఏడాది విగ్రహం ఎత్తు పెంచుతూ 30 అడుగులుగా నిర్దారించారు. 2021 అవతారం ఏకాదశ రుద్ర మహా గణపతి లక్ష్మీ దేవి, పార్వతి దేవి దేవతల విగ్రహాలతో కూడి ఉంటుంది. ఈ ఏడాది థీమ్‌ ‌కొరోనా సంక్షోభం నుంచి తిరిగి పునరుజ్జీవనం పొందింది. ఖైరతాబాద్‌ ‌గణేషుడి రూపశిల్పి రాజేంద్రన్‌ ‌చిన్న పూజ అనంతరం ఈ ఏడాది విగ్రహం పని ప్రారంభించారు. విగ్రహ తయారీలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో సహా ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు హస్తకళాకారులు పాల్గొంటారు. దేశంలో మూడో దశ కొరోనా వేవ్‌ ‌దృష్ట్యా ఈ సంవత్సరం కూడా గణేశ్‌ ఉత్సవ శోభ అంత ఆడంబరంగా ఉండకపోవచ్చు. సెప్టెంబర్‌ 10‌వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్‌ ‌గణేశ్‌ ఉత్సవ సమితి శనివారం తెలిపింది. ఈ ఏడాది కొవిడ్‌ ‌జాగ్రత్తలతో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్‌ ‌సెక్రెటరీ భగవంత్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 23న భాగ్యనగర్‌ ‌గణేశ్‌ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవాలు సెప్టెంబర్‌ 10‌న ప్రారంభమై..19వ తేదీ ఆదివారం నిమజ్జన కార్యక్రమంతో ముగియనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply