Take a fresh look at your lifestyle.

పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్‌

వినాయకుడికి ఒక దంతం విరిగి వుంటుంది. వ్యాసభగవానుడు మహాభారతం చెబుతుంటే గణపతి ఆపకుండా రాయాలన్నది షరతు కావడంతో, ఏకధాటిగా రచన కొనసాగడానికి తన కుడి దంతాన్ని విరిచి ఘంటంగా ఉపయోగించాడు వినాయకుడు. ఏనుగుకు అందాన్నిచ్చేవి దంతాలే. అలాంటి అందమైన దంతాన్ని అంటే బాహ్య సౌందర్యాన్ని లెక్క చేయకుండా మానవాళికి పంచమవేదాన్ని అందించేందుకు ప్రాధాన్యమిచ్చాడు. మనిషి బాహ్య రూపం ఎలావున్నా అతడి సుగుణాలతో లోకారాధ్యుడవుతాడన్న సందేశం అందించాడు.

భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్ది రోజున గణపతి జన్మించాడు కావున, ఆ రోజునే గణపయ్యను ప్రతిష్ఠించి ఆరాధిస్తాము. సకల దేవతలకూ గణపతిని అధిపతిగా నియమించిన రోజు ఇదేననీ అందుకే గణాది•••ప అని పిలుస్తారు. తొలిపూజ అందుకునే దైవం వినాయకుడు. వినాయకుడు ఓంకార స్వరూ పుడు. ఆయన రూపం ఎంతో విల క్షణ మైనది. ఆయనది ఏనుగు ముఖం, చిన్ని కళ్లూ, చాటంత చెవులూ, పెద్దతొండం, పెద్ద పొట్ట అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. గణేశుని తల గొప్పగా ఆలోచించాలనే దానికి గుర్తు. అన్ని విఘ్నాలను తొలగించ సమర్ధ వంతమైనది. చిన్న కళ్లు సూక్ష్మ దృష్టితో, ఏకాగ్రతతో ప్రతీదానినీ కేంద్రీకరించి చూడాలన్న అర్ధాన్ని బోధిస్తాయి. ఏనుగుతలలో కర్మేంద్రియం శక్తివంతంగా ఉంటుంది. గణపతి మాయ, మర్మం, మోసం, కపటం లాంటి వాటిని ప్రక్షాళన చేసి మంచిని, సత్యాన్ని ప్రబోధిస్తాడనడానికి శూర్పకర్ణాలు నిదర్శనాలు. అంతేకాదు.. స్వాభిమానానికి గుర్తు. పెద్ద చెవులు అన్నిటినీ సహనంతో శ్రద్ధగా వినమని సంకేతాన్నిస్తాయి. పెద్ద బొజ్జ ఎంతో జ్ఞానాన్ని జీర్ణించుకోవాలని సూచిస్తుంది. నాలుగు చేతులు ధర్మార్ధ కామ మోక్ష సాధనకు సంకేతాలు. అల్ప జీవులను అలక్ష్యం చేయరాదని మూషిక వాహనం చెప్పకనే చెబుతుంది. లంబోదరం కష్ట సుఖాలన్నింటినీ సమపాళ్లలో జీర్ణించు కోవాలని చెబుతుంది. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం ఈ నాలుగింటి పరిపూర్ణ దివ్యతత్వమే గణపతి స్వరూపం. తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తాము. కోరిన విద్యలకెల్ల బజ్జవై (గురువై) అని స్వామిని కొలుచుకోవడం పరిపాటి.గణం అంటే గుంపు. సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి. నాయకత్త లక్షణాలకు ఆయనే అధినాధుడు. శిక్షణనిచ్చి బుద్ధిని దిద్దే ప్రభువు వినాయకుడు. విఘ్నాలను పోగొట్టి విజయానందాలు ప్రసాదించే దైవమే విఘ్నేశ్వరుడు.

విఘ్నేశ్వరుడి జననంపై పలుగాధ లున్నాయి. వరాహపురాణంలో ఒక విధంగానూ, యజుర్వేదంలో మరో విధంగానూ చెప్ప బడింది. మనం ప్రతి సంవత్సరం గణేష్‌ ‌మహారాజుని పూజించి తప్పనిసరిగా విఘ్నే శ్వరుని కథ వింటాము. అందులో గజాసుర సంహారమూ,వినాయకోత్పత్తి విఘ్నే శాధిపత్యము, ఋషిపత్నులకు నీలా పనిందలు, శమంతకోపాఖ్యానము వుం టాయి. చివర్లో శమంతకమణి కథను విని అక్షింతలు శిరమున దాల్చినవారికి నీలా పనిందలు కలుగవని నమ్ముతాము.

ఈయన రూపం వింత గొలుపుతూ ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఆనందదాయకంగా వుంటుంది. ఆయన విలువలు నేర్పే దైవంగా కొనియాడాలి. తల్లితండ్రులను పూజిస్తే సకల శుభాలూ చేకూరుతాయనీ, వారి ఆశీస్సులతో సకల శుభాలూ చేకూరుతాయనీ, జీవితం ఆనందమయమవుతుందనీ వినాయకుడు మనకు తెలియపర్చాడు. వినాయకుని మనం సుముఖడు అని అంటాము. ఎవరి ముఖం చూడగానే మనకు ప్రశాంతత కలుగుతుందో, ఎవరు లోకక్షేమం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారో వారే నిజమైన సుముఖులని ఈ కథ చెబుతుంది. వినాయకుడికి ఒక దంతం విరిగి వుంటుంది. వ్యాసభగవానుడు మహాభారతం చెబుతుంటే గణపతి ఆపకుండా రాయాలన్నది షరతు కావడంతో, ఏకధాటిగా రచన కొనసాగడానికి తన కుడి దంతాన్ని విరిచి ఘంటంగా ఉపయోగించాడు వినాయకుడు. ఏనుగుకు అందా న్నిచ్చేవి దంతాలే. అలాంటి అందమైన దంతాన్ని అంటే బాహ్య సౌందర్యాన్ని లెక్క చేయకుండా మానవాళికి పంచమవేదాన్ని అందించేందుకు ప్రాధాన్యమిచ్చాడు. మనిషి బాహ్య రూపం ఎలావున్నా అతడి సుగుణాలతో లోకారాధ్యుడవుతాడన్న సందేశం అందించాడు.
జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, జయాపజయాలు, మానావమానాలతో మనో నిశ్చలతను కోల్పోరాదన్న విషయమూ అవగత మవుతుంది.

ఇతరులను వినాలన్న సందేశమూ వీరి చెవుల ద్వారా అందుతుంది. మంచిని మాత్రమే గ్రహించాలనీ, సమాజంలో అందరితో కలిసిమెలసి, సఖ్యతతో జీవించాలనే పాఠాన్నీ గణేశుడు అందించాడు. వినాయకుడు మోదక ప్రియుడు. అందరితో మధురంగా వ్యవహరించాలని సూచిం చేందుకే ఆయన ఉదరం, మోదకాలు అనీ చెప్పబడింది. వినాయకుడు హాస్యప్రియుడు. ఒకసారి ఆయన మేనమామ మహావిష్ణువునే ఆటపట్టించాడు. గుంజీలు తీయించి, హాయిగా నవ్వుకున్నాడు.అందుకే మనం కూడా వినాయకుడి ముందు గుంజీలు తీస్తాము. అంతేకాదు మూడు మొట్టికాయలు కూడా వేసుకుంటాము. గణపతి పూజలో 21 రకాల పత్రాలను ఉపయోగిస్తాము. పూలకంటే ఈయన పూజలో పత్రాలనే ఎక్కువగా వాడతాము. వీటిలో ఎన్నో ఔషద గుణాలున్నాయి కావున అవి మనకు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో వ్యా•ధులను నివారిస్తాయి. వర్షఋతువులో వచ్చే ఈ పండుగ రోజున స్వామికి ఆవిరి పదార్ధాలను నైవేద్యంగా పెడతాము. ఆయనకు వెలగపండ్లన్నా, కొబ్బరికాయలన్నా, దానిమ్మలన్నా, అరటిపండ్లన్నా ఎంతో ఇష్టం.ఇకపూలలో  ఎర్రమ ందారాలూ, ఎర్రగులాబీలూ, ఎర్రని వస్త్రాలూ ఇష్టమైనవి.మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించి, వ్రతానంతరం ఉద్వాసన పలికి, విగ్రహాన్ని కదిపి, పూజచేసిన పత్రి, పూలూ, మొదలైన వాటిని నీటిలో వదిలిపెడతాము.

హైదరాబాదు నగరంలో ప్రతీ సంవత్సరమూ లక్షలాదిగా వెలుస్తున్న వినాయక చవితి పందిళ్లలో వినాయుకుడు విశ్వరూపుడై నిజంగానే సహస్ర రూపుడిగా దర్శనిమిచ్చేవాడు.35 సంవత్సరాల క్రితం జంటనగరాల్లో వినాయక చవితి వచ్చిందంటే ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేవారు. అరాచక శక్తులకు అవకాశం కల్పించినట్లయి, అవి దహన కాండకూ, కర్ఫ్యూ విదించావల్సిన విపరీత పరిస్థితు లకూ దారి తీసినవి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పరిస్థితీ మారి, ప్రశాంతంగా హుస్సేన్‌ ‌సాగర్‌ (‌టాంక్‌ ‌బండ్‌) ‌లో నిమజ్జనం కొనసాగింది. అన్ని విగ్రహాలు ఒక తీరైతే, ఖైరతాబాద్‌ ‌గణేశుడు ఒకవిధంగా విశ్వరూపాన్ని దాల్చాడా అన్నట్లుగా రూపు దిద్దుకునేది. కానీ ఈ సంవత్సరం కొరోనా మహమ్మారి ప్రభావం దృష్ట్యా ఎవరికి వారు తమ గృహాల్లోనే స్వామిని భక్తితో పూజించుకోవల్సి వచ్చింది. ఇక స్వామివారి లడ్డూను లక్షల రూ పాయలకు వేలం వేసేవారు. ఈ ఎడాది స్వామివారికి అంతటి వైభవం కనిపించే అవకాశం లేకుండా పోయింది. బ్రిటీష్‌ ‌హయాంలో హిందూ జాతిని ఐక్యపరిచి ఒకే తాటిపై నడిపి స్వాతంత్య్ర భావాలు వారిలో నింపే ఉద్దేశ్యంతో ఆనాడు లోకమాన్య బాలగంగాధర్‌ ‌తిలక్‌ ‌వినాయక ఉత్సవాలను ప్రోత్సహించారు. హైదరాబాదులో ఈ నిమజ్జన ఊరేగింపులకు నాంది పలికింది అప్పటి ముఖ్య మంత్రి డా మర్రి చెన్నారెడ్డి గారన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవడం సబబు. కోట్లాది ప్రజలను భక్తి భావాలతో ముంచెత్తుతూ యువతను సంఘటితం గావించి, సన్మార్గం వైపు నడిపించే ఈ విద్యా నాయకుడు, సిద్ధి, బుద్ధి సహితంగా, ఆరోగ్యంతో అందరినీ ఆశీర్వదిస్తాడని ఆశిద్దాం.

డా।। పులివర్తి కృష్ణమూర్తి

Leave a Reply