- గిరిజనులు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ
- సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రలకూ శంకుస్థాపన చేసిన సిఎం జగన్
అమరావతి,అక్టోబర్ 2 : గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గిరిజనులు అన్ని విధాలా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని జగన్ అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆన్లైన్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామగ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.లక్షా 53వేల మంది గిరిజనులకు 3.12లక్షల ఎకరాల భూమి పంపిణీ , రైతు భరోసా సాయం అందిస్తున్నామని తెలిపారు. రూ.500 కోట్లతో పాడేరులో నిర్మించనున్న గిరిజన వైద్యకళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి, విజయనగరం జిల్లా కురుపాంలో 153 కోట్లతో చేపట్టిన గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాల భూమిపై హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
గాంధీ జయంతి రోజున గిరిజనులకు పట్టాల పంపిణీ ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చినట్టు సీఎం తెలిపారు. వచ్చే నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి హక్కుల పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. గిరిజనులకు పట్టాల పంపిణీతో పాటు రైతు భరోసా సొమ్ము రూ.13,500 కూడా అందించనున్నట్టు తెలిపారు. వారు తీసుకున్న భూమిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గిరిజనులకు వైద్యం అందక మరణించిన ఘటనలు గతంలో చాలా జరిగాయని, పరిస్థితులను మార్చాలనే నిర్ణయంతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నదని ఆయన అన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు అభివృద్ధి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. భూ వివాదాలకు ఎక్కడా తావు లేకుండా డిజిటల్ సర్వే ద్వారా పంపిణీ చేశాం. గిరిజనులకు భూమితో పాటు రైతు భరోసా కింద సాయం అందిస్తాం. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటాం.పంటలు పండించుకునేందుకు గిరిజనులకు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు.
గిరిజనులకు ఫారెస్ట్ అధికారులతో పాటు కలెక్టర్లు దిశానిర్దేశర చేస్తారని సీఎం పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా రాలేదన్నారు. గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి.గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి. సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, బుట్టాయిగూడెం, రంప చోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకం కింద గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికా హారం అందిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ డియం చదువులను తీసుకొచ్చామని’ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.