- అక్కడ సౌకర్యాలు సరిగా లేవు
- సీరియస్ పేషెంట్లను కూడా పట్టించుకోవడం లేదు
- ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపాటు
రాష్ట్రంలో కొరోనా కేసులు పెరుగుతుంటే…వాటిని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టకుండా కేసీఆర్ తన ఫామ్ హౌజ్ లోనో,ప్రగతి భవన్ లోనో కూర్చుంటే సరిపోదని తెలంగాణ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. అందులోనుంచి బయటకు వచ్చి పరిస్థితిని చూడాలని డిమాండ్ చేశారు. ఒక సారి సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రిని దర్శించాలని అది ఆస్పత్రిలా లేదని శ్మశానాన్ని తలపిస్తోందన్నారు. అందులో కరోనా వైరస్ తో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గాంధీ ఆస్పత్రికి తాను కూడా వస్తానన్న రాజా సింగ్ గ్రౌండ్ లెవల్ కు వెళ్లి చూస్తే కానీ వాస్తవాలు తెలియవన్నారు. ఈ విషయాన్ని తాను రాజకీయం చేయడం లేదని,రాజకీయాల కోసం మాట్లాటం చేయడం లేదని స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రి కంటే శ్మశానం నయమని జర్నలిస్ట్ మనోజ్ సభ్యులు కూడా అన్నట్లుగా రాజాసింగ్ తెలిపారు.
గాంధీ లో ట్రీట్మెంట్ సరిగ్గా జరగడం లేదనడానికి వారి మాటలే సాక్ష్యమన్నారు. సీరియస్ పేషెంట్లను కూడా పట్టించుకోవడం లేదు. గాంధీ ఆస్పత్రి సరిపోకపోతే ఇతర ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకోవాలని కోరారు. ఇతర రాష్టాల్లో్ర అయితే అన్ని సదుపాయాలు కల్పించి వైద్యం చేస్తున్నారన్న రాజా సింగ్, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.