Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా.. కొనసాగుతున్న వర్షాలు

  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలు
  • ఆర్డీఎస్‌ ‌కాల్వకు గండి..జలమయమయిన గద్వాల

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా మధ్యబధ్య కొంత విరామం ఇస్తూ కూరుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వేల ఎకరాల్లో వేసిన పంట నీట మునిగి రైతులు తిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. పలు చోట్ల విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలె పడుతున్నారు.

హైదరాబాద్‌ ‌పలుప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్‌ ‌నగరంలోని పలుప్రాంతాల్లో శనివారం కూడా భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, ‌వనస్థలీపురం, హయత్‌ ‌నగర్‌, అబ్దుల్లాపూర్‌ ‌మేట్‌, ‌దిల్‌ ‌సుఖ్‌ ‌నగర్‌, ‌చైతన్య పురి, సరూర్‌ ‌నగర్‌, ‌కర్మన్‌ఘాట్‌, ‌కొత్తపేట్‌, ‌ర్‌పేట్‌, ‌కీసర, జవహర్‌నగర్‌, ‌దమ్మాయిగూడ, నాగారం, నేరేడ్‌మెట్‌ ‌ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అనేకచోట్ల ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి. పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌ ‌స్తంభించిపోయింది. వాగులు, వంకలు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..మరోసారి భాగ్యనగరాన్ని ముంచెత్తింది. శనివారం మధ్యాహ్నం నగరంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జీహెచ్‌ఎం‌సీ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జీహెచ్‌ఎం‌సీ ఆదేశాలు జారీ చేస్తోంది. డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ ‌ఫోర్స్ ‌బృందాలు పలు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శంకర్‌పల్లికి సపంలోని మూసీవాగు, తీగల వాగు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరద నీరు శంకర్‌పల్లి పట్టణంలోకి భారీగా చేరింది. పట్టణమంతా నదిని తలపిస్తోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ ‌సరఫరాకు అంతరాయం కలిగింది. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కొందరి నివాసాల్లో బియ్యంతో పాటు ఇతర వస్తువులు తడిసి ముద్ద అయ్యాయి. గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

ఆర్డీఎస్‌ ‌కాల్వకు గండి.. జలమయమయిన గద్వాల
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో భారీగా వర్షాలు కువరవడంతో వాగులు, వంకులు పొంగుతున్నాయి. ఈ భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో.. అన్ని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. మానవపాడు మండల కేంద్ర సపంలో ఉన్న ఆర్డీఎస్‌ ‌కాలువకు గండి పడింది. డీ30 వద్ద కాలువ తెగిపోవడంతో.. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తీవ్రంగా పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గద్వాల పట్టణం జలమయం అయింది. గుంట వీధి, నల్లకుంట, రాజవీధి, చిన్న అగ్రహారం, గంజిపేట, సుంకులమ్మ మెట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. గద్వాలలో జలమయమైన ప్రాంతాలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ ‌రెడ్డి పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా దేవరకద్ర మండలం రాజోలి వద్ద రైల్వే అండర్‌ ‌బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజోలి, కౌకుంట్ల, వెంకటగిరి ప్రాంతాల్లో పత్తి పంట నీట మునిగింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారీ వర్షం కారణంగా మెయిన్‌ ‌రోడ్లపై మోకాలు లోతు నీరు పారుతోంది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పాత బస్టాండ్‌ ‌సర్కిల్‌, ‌రాజీవ్‌ ‌మార్గ్, ‌కొత్త బస్టాండ్‌, ‌పెట్రోల్‌ ‌బంక్‌, ‌కుంట వీధి, గంజి పేట, సుంకులమ్మ మెట్టు ఏరియాలన్నీ జలమయం అయ్యాయి. కుంటవీధిలో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలందరూ రాత్రంతా భయం భయంగా జాగారం చేయాల్సి వచ్చింది. గంజిపేటలో 30 గుడిసెలలో నీరు చేరడంతో జనం నీటిని తోడి పోసుకున్నారు. గతంలో ఎన్నడూ చూడనంత భారీగా వర్షం కురిసినట్లు స్థానికులు చెబుతున్నారు. వాన నీటిని తోడిపోసేందుకు నానా తంటాలు పడుతున్నారు. సరుకులు.. వస్తువులన్నీ నీట మునిగి పాడైపోయాయి.

నల్లగొండ జిల్లాలో 4,836 ఎకరాల్లో పంట నష్టం
గత కొన్ని రోజులుగా నల్లగొండ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా 4,836 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం, ఇసుక మేటలు వేయడంతో తొమ్మిది మండలాల్లోని 44 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ విభాగం అంచనా ప్రకారం.. 321 మంది రైతులకు చెందిన 1,664 ఎకరాల్లో పత్తి, 3,172 ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. ఈ వర్షాకాలంలో వానలు సకాలంలో కురియడం వల్ల అధికమొత్తంలో పత్తి, వరి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు ఆశిస్తున్నారు.

మిడ్‌మానేరుకు భారీగా వరదనీరు
భారీగా వస్తున్న వరద నీటితో శ్రీ రాజరాజేశ్వర జలాశయం మిడ్‌ ‌మానేరు నిండుకుంటోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీ కాగా… ప్రస్తుతం 26.17 టీఎంసీగా నమోదు అయ్యింది. అలాగే ఇన్‌ ‌ఫ్లో 9333 క్యూసెక్కులు, అవుట్‌ ‌ఫ్లో 7030 క్యూసెక్కులుగా ఉంది. మిడ్‌ ‌మానేర్‌ ‌ప్రాజెక్టు నీటి నిల్వ లైవ్‌ ‌కెపాసిటీని దాటింది. ప్రాజెక్టు నుండి 6 రేడియల్‌ ‌గేట్ల ద్వారా ఎల్‌ఎం‌డీకి 7030 క్యూలెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మిడ్‌ ‌మానేరు బ్యాక్‌ ‌వాటర్‌తో సంకేపల్లి, అరెపల్లి గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మిడ్‌ ‌మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. దీంతో సంకేపల్లి, ఆరేపల్లి గ్రామాలు ప్రమాదం బారిన పడబోతున్నాయి. బ్యాక్‌ ‌వాటర్‌తో గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. అర్థరాత్రి ఇళ్ళు ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వృద్ధులు, పిల్లలతో ఎలా వెళతాం అంటూ గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండా గ్రామాన్ని వదిలేది లేదంటూ మహిళలు భీష్మించారు.

Leave a Reply