Take a fresh look at your lifestyle.

15‌లోగా గచ్చిబౌలి కొరోనా ప్రత్యేక ఆసుపత్రి సిద్ధం

‌రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్క నేపథ్యంలో ప్రభుత్వం ఆసుపత్రులను సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా గతంలో సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించిన మేరకు గచ్చిబౌలిలో కొరోనా ప్రత్యేక ఆసుపత్రి ఈనెల 15 వరకల్లా అందుబాటులోకి రానుంది. ఈమేరకు మంగళవారం మంత్రులు ఈటల రాజేందర్‌, ‌కేటీఆర్‌తో పాటు పంచాయతీ రాజ్‌ ‌శాఖ ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో కలసి  గచ్చిబౌలిలోని స్పోర్టస్ అథారిటీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు.

ఈ ఆసపత్రిని కొరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దాదాపు 15 అంతస్తులలో ఉన్న ఈ భవనంలో ఆసుపత్రి ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయితే రోగుల కోసం దాదాపు 1500 పడకలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో రోజురోజుకూ కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వైరస్‌ ‌కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రులు ఈటల, కేటీఆర్‌ ‌గచ్చిబౌలి స్పోర్టస్ ‌కాంప్లెక్స్‌లో కొరోనా ప్రత్యేక ఆసుపత్రి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply