Take a fresh look at your lifestyle.

జీ 4..మరో వైరస్ ..!

  • చైనాలో బహిర్గతం ..ప్రపంచానికి మరో ప్రమాదం 
  • పని చేయని వ్యాక్సిన్లు ..
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి , న్యూ దిల్లీ: గతంలో H1 ..N1 .. స్వైన్ ఫ్లూ వైరస్ లు ఒక పెద్ద మహమ్మారిగా ప్రపంచం మీద విరుచుకు పడ్డాయి మళ్లీ ఇప్పుడు ఈ తరహా వైరస్ చైనా పందులలో కనిపించింది. ఈ వైరస్ పేరు G4 వైరస్. అమెరికా.. బ్రిటన్.. చైనా.. శాస్త్రవేత్తలు, ఈ వైరస్ మరో మహమ్మారి కాగలదని హెచ్చరిస్తున్నారు. 2009లో H1 ..N1 ..వైరస్ లు ఏ విధంగా అయితే విధ్వంసాన్ని సృష్టించాయో, అదే తరహాలో ఈ G4 వైరస్ విధ్వంసాన్ని సృష్టించగలదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ వైరస్ స్వైన్ ఫ్లూ వైరస్ జాతికి చెందినది అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రస్తుతం చైనా పందుల ఫామ్స్ లో పని చేసే వర్కర్లలో కనిపిస్తున్నది. చైనా ప్రపంచవ్యాప్తంగా పంది మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంచేత చైనాలో పెద్ద ఎత్తున పందుల ఫామ్స్ ఉన్నాయి. చైనాలో కూడా పంది మాంసాన్ని అత్యధికంగా ప్రజలు తీసుకుంటారు. చైనాలో అన్ని నగరాలలో పందుల ఫామ్స్ కనిపిస్తాయి. చైనాలో కనిపిస్తున్నా ఈ వైరస్ కి సంబంధించి చైనా ప్రభుత్వం ఈ సరికే ఒక ప్రకటన చేసింది. చైనాలో కనిపిస్తున్న ఈ వైరస్ అవుట్ బ్రేక్ కాకుండా చూస్తామని. చైనా ముందు ఉన్న సవాలు ఏమిటంటే.. చైనా పందుల ఫామ్స్ లో పనిచేసే 10 శాతం వర్కర్లకు G4 వైరస్ ఈసరికే సోకింది. ఇలాంటి పరిస్థితిలో చైనాను దాటి G4 వైరస్ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చైనా ప్రపంచానికి వాగ్దానం చేస్తున్నది. . ప్రపంచ దేశాలు చైనా వైపు చూస్తున్నాయి.

ఎందుకంటే 2009లో స్వైన్ ఫ్లూ H1 ..N1 ..వైరస్ లు ప్రపంచవ్యాపితంగా వ్యాప్తి చెంది, ప్రపంచ జనాభాలో 21 శాతం ప్రజలు ఈ వైరస్ భారిన పడ్డారు. దీని వలన ప్రపంచ జనాభాలో 4 నుంచి 5 లక్షల ప్రజలు మరణించారని ఓ అంచనా. 2009లో స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించింది. అయితే తరవాత స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ తో ప్రపంచ మానవాళి ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుత G4 వైరస్ కి ఎటువంటి పరిష్కారం లేదు. ఈ వైరస్ పై H1 ..N1 .. వ్యాక్సిన్ పని చేయటం లేదు. ప్రస్తుతం చైనా చెబుతున్నదాని ప్రకారం G4 వైరస్ పందుల నుంచి మానవులకు సోకుతున్నది. ఇది మానవుల నుంచి మానవులకి సోకితే ప్రమాదం ముంచుకు రావటం ఖాయం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రస్తుతానికి పందుల ఫామ్స్ లో వున్నా పందులకి ఈ వైరస్ సోకింది..వైరస్ సోకిన పందులన్నిటిని అంతం చేయాల్సివుంటుంది . పందుల పెంపకం పరిశ్రమ నడుపుతున్న చైనా పరిశ్రమల అధిపతులు దీనికి అంగీకరిస్తారో లేదో చూడాలి.. వైరస్లు ఇలా మనవాళిపై దాడి చేయటానికి ప్రధాన కారణం వ్యవసాయం కూడా ఓ పరిశ్రమ కావటమే అని నిపుణులు అంటున్నారు..

Leave a Reply

error: Content is protected !!