Take a fresh look at your lifestyle.

రూపాయి బియ్యానికి మరింత మెరుగు

  • డోర్‌ ‌డెలివరీ ద్వారా
  • నాణ్యమైన బియ్యం సరఫరా
  • సెప్టెంబరు 1నుంచి
  • రాష్ట్రవ్యాప్తంగా అమలుకు నిర్ణయం

అమరావతి,మే 9 : ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఎపి ప్రభుత్వం సెప్టెంబరు 1నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్దిదారుల ఇంటికే డోర్‌ ‌డెలివరీ చేయాలని నిర్ణయించింది. రూపాయికి ఏ రాదని తెలిసినా దీనిని మరింత ఖర్చుతో కూడుకున్న పనికి ప్రభుత్వం తెరతీస్తోంది. బహిరంగ మార్కెట్లో దాదాపు 25 నుంచి 50 రూపాయలు నడుస్తున్న బియ్యం దరలను కాదని రూపాయికే ఇవ్వడం, అదీ డోర్‌డెలివరీ చేస్తమాని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాలి. ఇది కేవలం ఓట్లను రాబట్టుకునే పథకం తప్ప మరోటి కాదు. సీఎం జగన్‌ ఆదేశాలతో నాణ్యమైన బియ్యం రాష్ట్రవ్యాప్తంగా డోర్‌ ‌డెలివరీ చేయడానికి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ఉమ్మడి ఎపిలో నాటి సిఎం కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కిలో రూపాయికి బియ్యం ధరలను దించారు. ఎన్టీఆర్‌ ‌ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం దశాబ్దాల తరవాత కిలో రూపాయికి దిగడం విడ్డూరం కాక మరోటి కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రేషన్‌ ‌పంపిణీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది అవినీతిని రూపుమాపడంతో పాటు పారదర్శకతకోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ప్రకటించింది. అయితే ధరలను సవరించే ప్రయత్నం చేయలేదు. దీనికోసం ప్రత్యేకంగా బియ్యంకార్డులను తీసుకు వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన వారందరికీ కార్డులు మంజూరుచేసే వ్యవస్థనూ మొదలుపెట్టింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం అందించడానికి సామాజిక తనిఖీలో భాగంగా సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాను ఉంచడమేకాకుండా, పేరులేని వారు ఎవరికి దరఖాస్తు చేయాలన్నదానిపై కూడా వివరాలు ఉంచింది. వాటి ఆధారంగా దరఖాస్తు చేసిన వారివి కూడా పరిశీలించి వారికి బియ్యం కార్డులను అధికారులు మంజూరుచేశారు. దీన్ని ఇంతటితో వదిలేయకుండా.. అర్హత ఉన్న వారికి బియ్యం కార్డులు మంజూరు అన్నది నిరంతర పక్రియగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. అంతేకాకుండా బియ్యం నాణ్యతపైనకూడా ప్రత్యేక దృష్టిపెట్టింది.

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ ‌బియ్యం తినలేని విధంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. మళ్లీ ఆ బియ్యాన్ని రీసైక్లింగ్‌ ‌చేసి మరలా మార్కెట్లోకి తీసుకు వచ్చేవారు. దీంతో పేదలకు నాణ్యమైన బియ్యం అందకపోవడంతోపాటు, అవినీతి చోటుచేసుకునేది. ఎన్నికల హాల్లోభాగంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్‌ ‌డెలివరీ చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌.‌జగన్‌ ‌హా ఇచ్చారు. దాంట్లో భాగంగానే తాజా ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని డోర్‌ ‌డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్‌ ‌ప్రాజెక్టుగా చేపట్టింది. నాణ్యమైన బియ్యాన్ని సేకరించడం, ఆ బియ్యాన్ని ప్యాక్‌ ‌చేయడం, ఇంటికే డోర్‌ ‌డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. నాణ్యమైన బియ్యాన్ని అందుకుంటున్న వారినుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే మంచి బియ్యం చౌకగా వస్టుంటే ప్రజలు మాత్రం ఎందకు కాదంటారని గుర్తుంచుకోవాలి. ఎక్కడెక్కడ ధాన్యం సేకరించాలి, వాటిని శుద్ధిచేయడమెలా, అదే సమయంలో కల్తీ లేకుండా చూసుకునేలా ఈ విధానాన్ని తీర్చిదిద్దారు. నాణ్యమైన బియ్యం డోర్‌ ‌డెలివరీని శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ మొదలుపెట్టామని పౌరసరఫరాల అధికారి కోన శశిధర్‌ ‌ప్రకటించారు. పైలట్‌‌ప్రాజెక్టులో మాకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేయబోతున్నట్లు వెల్లడించారు. పర్యావరణ సంబంధిత అంశాలనూ పరిగణలోకి పరిగణలోకి తీసుకున్నాం. లబ్దిదారులకు పారదర్శక పద్ధతిలో, అవినీతికి తావులేకుండా, నాణ్యమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. బియ్యాన్ని తీసుకోవడంకోసం లబ్దిదారునికి నాణ్యమైన సంచులను ఉచితంగా అందిస్తున్నాం. ప్రతినెలా 2.3లక్షల మెట్రిక్‌ ‌టన్నుల నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేయడానికి నిర్ణయించుకున్నారు.

Leave a Reply