Take a fresh look at your lifestyle.

రంజాన్‌ ‌వేళ హిందువుల అంత్యక్రియలు .. హిందూ – ముస్లిం ఐక్యతకు ప్రతీక..! మానవత్వం పరిడవిల్లింది.. మతసామరస్యం వెల్లివిరుస్తోంది..!!

ఈ కరోనా కష్టకాలం చిత్ర విచిత్రాలకు నెలవుగా మారింది. ఓ చోట మానవత్వం ప్రశార్థకంగా మారుతుంటే మరో చోట మానవత్వంతో పాటు మతసామరస్యం కూడా వెల్లివిరుస్తోంది. కరోనా ఎక్కడ చూసినా ఇదే మాట ..మహమ్మారి వేయి జడలు విప్పి విలయతాండవం చేస్తోందా? అన్నట్లుగా ఉంది భారత్‌ ‌లో ఏ మూలలో చూసినా. ఇటీవల భోపాల్‌ ‌లో కరోనా ప్రతాపంతో భారీ సంఖ్యలో కరోనా మృతుల సంఖ్య పెరిగింది.వారి కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. తమకు కూడా కరోనా సోకుతుందనే భయంతో మృతుల బంధువులు మృతదేహాలకు అంత్యక్రియలు కూడా చేయటంలేదు. కానీ అటువంటి మృతదేహాలకు మేమున్నాం అంటూ కరోనాతో చనిపోయిన హిందూ మృతదేహాలకు ముస్లిం సోదరులు. అన్నీ తామై అంత్యక్రియలు చేయడం వారి ఔన్నత్యానికి నిదర్శనం అలా ఇప్పటివరకు..భోపాల్‌ ‌లో వందల మంది హిందూ మృతదేహాలకు దగ్గరుండి హిందూ సంప్రదాయం ప్రకారంగా దహన సంస్కారాలు  చేసినారు, కన్నతల్లి, తండ్రులు  చనిపోతే కూడా  శవాన్ని తాకని ఈ రోజుల్లో భయంతోను..బాధతోను వారి మృతదేహాలను కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో కరోనాతో చనిపోయిన హిందూ మృతదేహాలకు  రంజాన్‌ ఉపవాసం ఉన్నాసరే మృతదేహాలకు ముస్లింల అంత్యక్రియలు దహనసంస్కారాలు చేయటం మానలేదు.కుల, మతాలు అడ్డురాలేదు.

మతసామరస్యం  వెల్లివిరిసింది..
కరోనా వైరస్‌ ‌కారణంగా ఈ ప్రాంతంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉంది. అహ్మదాబాద్లోని ఖాన్పూర్‌ ‌ప్రాంతంలో హిందువులు, ముస్లింల నివాసాలు పక్కపక్కనే ఉంటాయి.ఇక్కడ గతంలో మతపరమైన హింస కూడా చెలరేగింది.అయితే, తాజా ఘటన హిందూ-ముస్లిం ఐక్యతను చాటింది.75 ఏళ్ల మహిళ మందాకిని త్రిపాఠి, ఖాన్పూర్లో ఉన్న ఉషా-కిరణ్‌ అపార్ట్మెంటులోని తన ఫ్లాట్లో ఒంటరిగా ఉండేవారు. ఆమె పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.అయితే, గత కొద్ది రోజుల క్రితం ఆమె ఇంట్లో జారిపడ్డారు.

తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రాంతానికి చెందిన ఖాసిం గత 25 ఏళ్లుగా మందాకిని ఇంటికి రోజూ పాలు తీసుకొచ్చేవారు. ఎప్పటిలాగే ఆయన ఆ రోజు వెళ్లి ఇంటి  కాలింగ్‌ ‌బెల్లు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఖంగుతిన్న, ఖాసీం తన దగ్గర ఉన్న ఆ ఇంటి ఇంకోక తాళంచెవితో తలుపు తెరిచి చూడగా ఆమె నేలపై పడిపోయి కనిపించారు. ఖాసిం వెంటనే డాక్టర్కు ఫోన్‌ ‌చేసి పిలువడం,  డాక్టర్‌ ‌వచ్చి పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయారని చెప్పారు.దాంతో, ఆ విషయాన్ని అమెరికాలో ఉంటున్న మందాకిని కుమార్తెకు వీడియో కాల్‌ ‌ద్వారా ఖాసిం చెప్పారు.లాక్డౌన్‌ ‌కారణంగా విమానాలు నడవకపోవడంతో ఆమె భారత్‌ ‌రాలేకపోయారు. అహ్మదాబాద్లో ఉంటున్న తన మేనమామ రజనీకాంత్‌ ‌భాయ్కి ఆమె సమాచారం ఇచ్చారు.ఆయన హుటాహుటిన బైకుపై మృతురాలి ఇంటికి వెళ్లారు. అంత్యక్రియలు చేద్దామంటే సాయం చేసేవాళ్లు ఎవరూ లేరు. ఆయన ఇబ్బందులను గమనించిన ఖాసిం అదే ప్రాంతంలో ఉండే  ముస్లీం పెద్దలు డాక్టర్‌ ‌హకీం యాసిర్‌ ‌పిలిచారు.’’అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి బంధువులు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించి ముస్లీం సోదరులు ముందుకోచ్చి మీకు మేమున్నాం చింతించకండి మాకు మాత్రం హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేయడం మాకు పూర్తిగా తెలియదు. మీరు చెప్పండి మేమే దగ్గర ఉండి చేస్తాం అని ఒక భరోసా కల్పిస్తే, మృతురాలి సోదరుడు రజనీకాంత్‌ ‌భాయ్‌ ‌సూచనల ప్రకారం అంత్యక్రియలు సవ్యంగా నిర్వహించడం జరిగింది.

మానవత్వం పరిడవిల్లింది..
స్వతంత్య్ర దేశంలో చావుకూడాపెళ్ళి లాంటిదే బ్రదర్‌ అని 40 సంవత్సరాల క్రితం ఆకలిరాజ్యం సినిమాలోచూసాం ..ఇప్పుడు ఈతతంగం భాదతప్త హృదయాలతో చివరి చూపుకు నోచుకోని కన్నపేగు ( మేనకోడలు )కోర్కే మేరకు ‘‘అమెరికాలో ఉంటున్న మరికొందరు బంధువులు, మా అక్క అంత్యక్రియలను చూడాలని  ఆరట పడడంతో  అసలే రజనీకాంత్‌ ‌వయసు 64 ఏళ్లు. టెక్నాలజీ గురించి ఏమీ తెలియదు.

దాంతో, అక్కడ ఉన్న ముస్లీం సోదరులు వారి ఫోన్‌ ‌నుంచి వీడియో కాల్‌ ‌చేసి వాళ్లకు చూపించారు. వారి బంధువులు కూడా కొద్ది మంది వచ్చారు.కాని శవాన్ని ముట్టుకోవడానికి ఏవరు సహాసం చేయలేదు నలుగురు ముస్లిం సోదరుల సాయంతో శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్ళి దహాన సంస్కారాలు దగ్గర ఉండి చేయడం మానవత్వం సజీవసాక్ష్యాలుగా  పరిడవిల్లిందనే చెప్పాలి. …నిజంగా రజనికాంత్‌ అక్క ఉండేది నాలుగో అంతస్తులో. ముస్లిం సోదరులు సాయం చేయకపోతే, శవాన్ని కిందికి తీసుకురావడం ఏ ఒక్కరితో సాధ్యమయ్యేదే కాదు. విచిత్రం ఏమిటంటే ‘‘ హిందువులతో పాటు ఈ ముస్లిం సోదరులు కూడా ‘హర హర మహాదేవ’ అంటూ నినాదాలు మార్మోగేలా  చేశారు.  రజనీ కాంత్‌ ‌మాటల్లో ‘‘హిందు సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అవసరమయ్యే వస్తువులు తీసుకొచ్చేందుకు నేనే వెళ్లాను. ముస్లిం వ్యక్తి.. హిందువుల అంత్యక్రియల వస్తువుల కోసం వచ్చారేంటి? అని దుకాణం యజమాని అడిగారు. ఒక హిందూ మహిళ చనిపోయారు, అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం అని చెప్పాను. అది వినగానే వెంటనే ఆయన గులాబీ పూలు కూడా తెప్పించి ఇచ్చారు. వాటికి డబ్బులు కూడా తీసుకోలేదు. మిగతా వస్తువులకు కూడా చాలా తక్కువ డబ్బులే తీసుకున్నారు. మనుషులు ఒకరికొరు సాయం చేసుకోవాలి. ఒకరి మంచి గురించి మరొకరు ఆలోచించాలి, వాస్తవానికి ఆ నలుగురు ముస్లింలు ఎవరో తనకు పరిచయం లేదని, అయినా వాళ్లు తనకు సాయం చేశారని,వాళ్లు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరచిపోలేను’’ అని ఆయన అన్నారు. రజనీకాంత్‌ ‌తెలిపడం గమనార్హం.కులంపేరిట, మతాల పేరిట లేని గోడవలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్న హిందూ,ముస్లీం నాయకులకు ఇది ఒక హెచ్చరిక లాంటిదే. పాజిటీవ్‌ ‌మైండ్‌ ‌తో ఉన్న ప్రతి ఒక్కరిని విజయం వరిస్తుంది.

ప్రేమ గెలిచింది మతం ఓడింది..
దేశం మొత్తం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి సహాయం కోసం అర్థిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌ ‌లక్నోలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల దయనీయ పరిస్థితులను ఎవరూ పట్టించుకోని పరిస్థితులలో , కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఓ ముస్లిం యువకుల బృందం ముందుకు వచ్చింది. ఒక పక్క పవిత్రమైన రంజాన్‌ ‌నెలలో ఉపవాస దీక్షలు పాటిస్తూనే అంత్యక్రియలను సైతం ఓ ముస్లిం యువకుల బృందం కొనసాగిస్తుంది. కేవలం సామాజిక మాద్యమాల ద్వారా సంప్రదించిన వారికి సహాయం చేయడానికి రంగంలోకి దిగింది. యూపీలోని ఓ ముస్లిం యువకుల బృందం. పిపిఇ కిట్లు ధరించి, ఈ యువకులు కరోనా మహమ్మారి చేతిలో పోరాడి ఓడిన వారి అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ప్రపంచం భయంకర కరోనా వైరస్‌ ‌మహమ్మారి తో పోరాడుతున్న సమయంలో మతాన్ని పక్కన పెట్టి మానవత్వంతో ముందుకు వెళ్తున్నారు ఈ ముస్లిం యువకులు.

మతసామరస్యానికి నిజమైన అర్ధం చెప్తున్నారు.ఉత్తరప్రదేశ్‌ ‌లక్నోలోని ఓల్డ్ ‌సిటీలోని మక్బారా గొల్గంజ్‌ ‌ప్రాంతంలో నివసిస్తున్న ముప్పై మూడేళ్ల ఇమ్దాద్‌ ఇమాన్‌ ఒక స్టోర్‌ ‌యజమాని మరియు గ్రాఫిక్‌ ‌డిజైనర్‌. అతను తన వద్ద ఉన్న 22 మంది యువకుల బృందంతో కలిసి కరోనా కష్టకాలంలో పలువురికి సహాయం చేస్తున్నారు.కరోనా వైరస్‌ ‌మృతులను సైతం ఖననం చేశారు. చిత్ర విచిత్రాలకు  కేంద్ర బిందువుగా మారింది.కరోనా ఎక్కడ చూసినా ఇదే మాట ..మహమ్మారి వేయి జడలు విప్పి విలయతాండవం చేస్తోందా? అన్నట్లుగా ఉంది భారత్‌ ‌లోని ఏ మూలలో చూసినా.కరోనా ప్రతాపాన్ని చూపిస్తోంది.

భారీ సంఖ్యలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.‘‘ముహబ్బత్‌ ఇత్నీ బార్కరార్‌ ‌రఖో? కే మఝత్‌ ‌బీచ్‌ ‌మే నా ఆయే,తుమ్‌ ఉసే మందిర్‌ ‌తక్‌ ‌ఛోడ్‌ ‌దో, వహ్‌ ‌తుమ్హే మస్జిద్‌ ‌తక్‌ ‌ఛోడ్‌ ఆయే’’ అని ఉర్దూలో ఆయన సందేశం ఏమిటంతే ( ‘‘ప్రేమ మధ్యలో మతం ఉండకూడదు. నీవు వారిని ఆలయం దగ్గర దించితే, వారు నిన్ను మసీదు దగ్గరికి తీసుకెళ్తారు.’’ ) రంజాన్‌ ఉపవాస దీక్షలు చేస్తూనే, హిందూ కరోనా మృతులకు అంత్యక్రియలు చేసిన రియల్‌ ‌వారియర్స్ ‌ముస్లీంలే అనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు..కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో భారతదేశంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతుంది.మరికొన్ని చోట్ల మానవత్వం వెల్లివిరుస్తోంది. కులమతాలకు అతీతంగా కరోనా కష్టకాలంలోసాటివారిని ఆదుకోవాలన్న భావన చాలామందిలో కలగడం ఈ సమయంలో ప్రధానంగా కనిపించడం ముధావహాం.
హిందువుల పండుగలు జరుపుకుంటారు..
హర్యానాలో తాజాగా 40 ముస్లిం కుటుంబాలకు చెందిన 250 మంది హిందూమతం స్వీకరించారు.

హిసార్‌ ‌జిల్లాలోని భీత్మడా గ్రామానికి చెందిన ఈ కుటుంబాలు హిందూత్వంలోకి ప్రవేశించడమే కాకుండా, హిందూ మతాచారాల ప్రకారం ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు కూడా నిర్వహించాయి. ఈ గ్రామానికి చెందిన చాలామంది ముస్లింలు మొఘల్‌ ‌పాలకుడైన ఔరంగజేబు కాలంలో బలవంతంగా మత మార్పిళ్లకు లోనైనట్టు పూర్వీకుల ద్వారా తెలుసు కున్నారు. ఊళ్లో ఉన్న ముస్లింలు హిందువుల పండు గలన్నీ జరుపుకుంటారని, ఎవరైనా చనిపోతే మాత్రం ముస్లిం పద్ధతిలో ఖననం చేసేవారని ఓ వ్యక్తి తెలిపాడు. ఇటీవలే గ్రామంలో అత్యధికులు హిందూమతంలోకి రావడంతో పాటు, ఇటీవలే మరణించిన 80 ఏళ్ల వృద్ధురాలి అంత్యక్రియలు హిందూ మతాచారాలకు అనుగుణంగా నిర్వహించారు. మతం మారాలని ఏవైనా ఒత్తిళ్లు వచ్చాయా అని సదరు వ్యక్తిని మీడియా ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని, ఏ ఒక్క గ్రామస్తుడు తమతో అమర్యాదగా ప్రవర్తించింది లేదని స్పష్టం చేశాడు. గతంలో అన్నీ బాగానే ఉన్నా, అంత్యక్రియల వద్దకు వచ్చేసరికి మతం వేరన్న విషయం స్పష్టంగా కనిపించేదని,గ్రామస్తులు తమను ప్రత్యేకంగా చూసేవాళ్లని, ఇప్పుడా బాధ లేదని మాజిద్‌ అనే యువకుడు తెలిపాడు. భవిష్యత్‌ ‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.

ఖననం కోసం పీఎఫ్‌ఐ  ‌కమిటీ ఏర్పాటు..
మృతి చెందిన అనాథ మృతదేహాలకు కులమత బేధం లేకుండా ముస్లిం యువత చేయూతను అందించారు. పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాకు చెందిన కార్యకర్తలు కొవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు.

కుటుంబ సభ్యులే భయపడుతున్న తరుణంలో ముస్లిం యువకుల సాహసం అంతాఇం తాకాదు ఈ బాధితుల్లో చాలా మందికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాని పరిస్థితుల్లో ఈ ముస్లిం యువకులు నడుంబిగించి మరీ అంత్యక్రియలను నిర్వహించారు.ఇమామ్‌ ‌గత సంవత్సరం కోవిడ్‌ -19 ‌మృతుల ఖననాలకు కమిటీని ప్రారంభించాడు. కరోనా బాధిత మృతుల అంత్యక్రియలను వారు నిర్వహిస్తున్న తీరు, పలు కేసుల దారుణ పరిస్థితుల నేపధ్యంలోనూ వీరు చూపించిన ధైర్యం వీరి సాహసోపేతమైన చర్యలను ప్రశంసించేలా చేస్తున్నాయి .కరోనా సంక్షోభంలో మతాన్ని పక్కనపెట్టి మానవత్వంతో కరోనా బారిన పడిన కుటుంబ సభ్యుల మృతదేహాలను ముట్టుకోవడానికి కూడా సాహసం చెయ్యని బంధువులు ఉంటున్న నేటి రోజుల్లో, అలాంటి వారందరికీ అంత్యక్రియలు నిర్వహిస్తూ కరోనాపై భారతదేశం చేస్తున్న పోరాటంలో మేము సైతం అంటున్నారు ఈ ముస్లిం యువకులు.హిందూ, ముస్లిం అనే భేదభావం లేదని మనమంతా మనుషులమని, సాటి మనుషులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని  చాటిచెప్పి ఆదర్శంగా నిలుస్తుండడం వారి చిత్తశుద్ద్దికి నిదర్శనం. కరోనా కష్టకాలంలో అడుగడుగున పీక్క తింటున్న ఈ సమాజంలో..  పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు చేసే సేవకు ఎటువంటి రుసుం లేదని  పేర్కొన్నారు.మానవత్వం ముందు మతం ఓడిపోయింది. మేర భారత్‌ ‌మహాన్‌.

ముందు మతం ఓడిపోయింది. మేర భారత్‌ ‌మహాన్‌.
 – ‌డా.సంగని మల్లేశ్వర్‌,‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ,కాకతీయ విశ్వవిద్యాయం, వరంగల్‌.
‌సెల్‌-9866255355.

Leave a Reply