ప్రజలు, నేతలు కన్నీటి వీడ్కోలు
విమనాశ్రయంలో గవర్నర్ తదితరుల నివాళి
ప్రజాతంత్ర, నిజామాబాద్ : వీర జవాన్ ర్యాడ మహేశ్‌కు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. నిజామాబాద్ జిల్లాలోని మహేశ్ స్వగ్రామమైన కోమన్‌పల్లిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సరిహద్దులో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ ర్యాడ మహేశ్ అంత్యక్రియలు ముగిశాయి.
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మహేశ్ పార్ధివదేహాంపై జాతీయ జెండాను ఉంచిన అధికారులు ఆ తర్వాత నివాళులర్పించారు. వీరమరణం పొందిన జవాన్ మహేశ్‌కు చివరి సారిగా కుటుంబ సభ్యులు, నేతలు నివాళులర్పించారు. బీజేపీ ఎంపీ అర్వింద్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.