Take a fresh look at your lifestyle.

నేడు యశోదాలో సిఎం కెసిఆర్‌కు పూర్తిస్థాయి పరీక్షలు?

కొరోనా నుంచి కోలుకుంటున్న ముఖ్యమంత్రి
కొరోనా పాజిటివ్‌తో హోమ్‌ ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మంగళవారం రాత్రి యశోదా హాస్పిటల్‌కి వొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో కేసీఆర్‌కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న ముఖ్యమంత్రికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ నెల 21న యశోద హాస్పిటల్‌లో సీటి స్కాన్‌తో పాటు ఇతర టెస్ట్‌లను సీఎం చేయించుకున్నారు. అనంతరం హోమ్‌ ఐసోలేషన్‌లోనే సీఎం కేసీఆర్‌ ‌చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఫామ్‌ ‌హౌస్‌లో కేసీఆర్‌ ‌విశ్రాంతి తీసుకుంటున్నారు. నిలకడగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోవిడ్‌ ‌నెగిటివ్‌ ‌రాగానే రెండు రోజుల్లో కొరోనాపై రివ్యూ జరిపే అవకాశం ఉంది. బుధవారం లేదా గురువారం కోవిడ్‌పై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సవి•క్షా• సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మరో మూడు రోజుల్లోనే సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సీఎం సమావేశంకానున్నారు. ఎక్కడ అయితే కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్నాయో ఆ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ‌పెట్టడం లేదా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ ‌పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కేసులు తగ్గుముఖం పడితే సడలింపులు ఇచ్చే యోచనలో సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply