Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్త బంద్ కి సంపూర్ణ మద్దతు

  • వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేతుల్లో పడితే రైతులకు నష్టం
  • కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి మద్దతు పలకాలి
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

దేశ వ్యాప్తంగా రైతులు ఇచ్చిన బంద్ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. ఆదివారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ప్రెస్ మీట్ లో భట్టితో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, ఏఐసీసీ కిసాన్ కాంగ్రేస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వ్యవసాయ రంగం పై ఆదారపడిన వారిని కార్పొరేట్ శక్తులకు కేంద్రం దాసోహం చేస్తోందని అన్నారు.

కేంద్రం తెచ్చిన మూడు బిల్లులను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు. మద్దతు ధర ప్రకటించకుండా కార్పొరేట్ కంపెనీల నిర్ణయించే రేటుకు అమ్మాలనే నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు భట్టి చెప్పారు. దేశ వ్యాప్తయంగా రైతులు 8న చేస్తున్న బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లుప్రకటించారు. దేశ ఆర్థిక విధానమే వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. దీన్ని కార్పొరేట్ శక్తులకు దాసోహం చేయడం సమజసం కాదన్నారు. రైతు బిల్లుల కోసం రాష్ట్ర అసెంబ్లీ ని తక్షణమే సమావేశ పరచాలని భట్టి డిమాండ్ చేశారు.

Leave a Reply