Take a fresh look at your lifestyle.

సాగర్‌ ఆయకట్ట రైతులకు పూర్తిస్థాయిలో నీటి విడుదల

నీటి పారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ‌నాగార్జున సాగర్‌ ఆయకట్టకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ‌నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణా నది ఎగువన నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉన్నందున సాగర్‌ ఆయకట్ట రైతులకు శుక్రవారం నుంచే నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న రైతులకు ప్రయోజనం కలుగనుంది. ఈమేరకు ఈమేరకు శుక్రవారం సీఎంవో కార్యాలయం ట్విట్టర్‌ ‌ద్వారా తెలిపింది. నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులకు వెంటనే నీటి విడుదల ప్రారంభం కావాలని చీఫ్‌ ఇం‌జనీర్‌ను సీఎం ఆదేశించారని వెల్లడించింది.

కృష్ణా నది ఎగువన నీటి ప్రవాహం అధికంగా ఉందనీ, దీంతో పాటే ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్నందున సాగర్‌ ఆయకట్టు రైతులకు ఈ వానాకాలం పంటలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారని సీఎంవో కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది. కాగా, నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం నీటి నిల్వ 224 టీఎంసీలు ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండిపోవడదంతో పాటు శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద కొనసాగుతున్నది. మరోవైపు వర్షాలు సైతం భారీగా కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం రైతులకు వానాకాలం పంట కోసం నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!