Take a fresh look at your lifestyle.

వొచ్చే ఏడు పూర్తిస్థాయిలో రైతు రుణ మాఫీ

  • బడ్జెట్‌లో మూడో వంతు రైతులకే ఖర్చు చేస్తున్నాం
  • రైతు సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయి
    :మంత్రి హరీష్‌ ‌రావు

గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశాయని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాష్ట్ర బ్జడెట్‌లో మూడో వంతు రైతులకే ఖర్చు చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కామారంలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ ‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మెదక్‌ ‌జిల్లాలో రూ.94 కోట్లతో 1888 మంది రైతులకు బీమా సాయం అందించామని చెప్పారు. యాసంగిపంట సాయం కోసం జిల్లాకు రూ.190 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట సాయంగా రూ.7,200 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. అతిత్వరలో కాళేశ్వరం ద్వారా మెదక్‌ ‌జిల్లాకు నీరందిస్తామని వెల్లడించారు. వొచ్చే ఆర్థికసంవత్సరం సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇస్తామని ప్రకటించారు.

అంతకుముందు చిన్నశంకరంపేటలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. వొచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో రైతు రుణ మాఫీ చేస్తామని, కొరోనా వైరస్‌ ‌వల్ల ఆసాకి కొద్దీగా ఆలస్యం అయిందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో మంత్రి హరీష్‌ ‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటించారు. శంకరపట్నంలో ఏర్పాటు చేసిన రైతు వేదికను హరీష్‌ ‌రావు, పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌మాట్లాడుతూ…. తెలంగాణలో అన్ని వర్గాలవారికి కమిటీలు ఉన్నాయి. కానీ  రైతుకు ఏ కమిటీ లేదని ఆయన అన్నారు. రైతుకు వేదిక కావాలని రైతు అందుకోసం రైతు వేదిక నిర్మాణం చేపట్టామని తెలిపారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు బ్జడెట్‌ ‌ఖర్చు చేస్తోందని, రైతులకు పామాయిల్‌ ‌తోటలు పట్టు తోటలు పెంచే విధంగా సబ్సిడీలను అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా రైతులు కోసిన తర్వాత ఇబ్బందులు లేకుండా దాన్యం ఆరబోసు కోవడం కోసం కళ్లాల నిర్మాణానికి డబ్బులు అందజేస్తున్నామని వెల్లడించారు.

Leave a Reply