Take a fresh look at your lifestyle.

నేటి నుంచి.. పార్లమెంటు బడ్జెట్‌ ‌సమావేశాలు

From today .. Budget sessions of Parliament

నేడు రాష్ట్రపతి ప్రసంగం, రేపు బడ్జెట్‌ ‌ప్రవేశం

పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలకు రంగం సిద్ధమయ్యింది. శుక్రవారం నుంచి పార్లమెంట్‌ ‌ప్రారంభం కానుంది. ఫిబ్రవరి1న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ‌బడ్జెట్‌ ‌ప్రవేశ పెడతారు. శుక్రవారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాత్‌ ‌కోవింద్‌ ‌ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారు. ఇకపోతే శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 3‌వ తేదీ వరకు పార్లమెంటు బ్జడెట్‌ ‌సమావేశాలు జరుగుతాయి. మధ్యలో ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు విరామం ఉంటుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బ్జడెట్‌, ఆర్థిక పద్దులపై చర్చ, వోటింగ్‌కే అధిక సమయం పడుతుంది. మరోవైపు… కేంద్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే 42 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యక్తిగత సమాచార (డేటా) పరిరక్షణ, పారిశ్రామిక సంబంధాల కోడ్‌, ‌సరోగసీ, సంస్క•త యూనివర్సిటీలు, యాంటీ మారిటైమ్‌ ‌పైరసీ బిల్లు, డీఎన్‌ఏ, ‌సామాజిక భద్రతా కోడ్‌ ‌మొదలైన బిల్లులపై పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు… సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీపై భగ్గుమంటున్న విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేసే అవకాశమూ ఉంది.

ఇదిలావుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 5 శాతంగానే ఉండొచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసింది. తమ ఆర్థిక ముఖచిత్రం సర్వేలో జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) అంచనాలకు తగ్గట్లుగా వృద్ధిరేటు అంచనాల్ని వెల్లడించింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు 2.6 శాతంగా ఉండొచ్చన్న ఫిక్కీ.. పరిశ్రమ, సేవా రంగాల్లో 3.5 శాతం, 7.2 శాతంగా అంచనా వేసింది. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం మూడో తైమ్రాసికం (అక్టోబర్‌-‌డిసెంబర్‌)‌లో దేశ వృద్ధిరేటు 4.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అంతకుముందు తైమ్రాసికంలో 4.5 శాతంగానే ఉన్న విషయం తెలిసిందే. తొలి తైమ్రాసికంలో 5 శాతంగా ఉన్నది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ జీడీపీ 5.5 శాతంగా నమోదు కావచ్చని ఫిక్కీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈసారితో పోల్చితే 0.5 శాతం పెరుగడానికి వీలుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు ఎగుమతులు మరింత తగ్గవచ్చని, ఈ ఆర్థిక సంవత్సరం గతంతో పోల్చితే 2.1 శాతం మేర పడిపోవచ్చని ఫిక్కీ అంచనా వేసింది. దిగుమతులు సైతం 5.5 శాతం తగ్గవచ్చని చెప్పింది. ఇక కరెంట్‌ ‌ఖాతాలోటు జీడీపీలో 1.4 శాతానికి పెరిగే వీలుందన్నది. ఈ అంచనాల నేపథ్యంలో బడ్జెట్‌ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది.

  • సీఏఏను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌
  • అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్‌ ‌వైఖరి చెప్పిన
  • పార్లమెంటు సభ్యులు కే.కే., నామానాగేశ్వరరావు

‌తెలంగాణ రాష్ట్ర సమితి సీఏఏ బిల్లును కచ్చితంగా వ్యతిరేకిస్తున్నదని టీఆర్‌ఎస్‌ ‌పార్లమెంట్‌ ‌నేత కే.కేశవరావు, టీఆర్‌ఎస్‌ ‌లోకసభ పక్ష నాయకుడు నామానాగేశ్వరరావు స్పష్టం చేశారు. లోకసభలో, రాజ్యసభలో ఈ బిల్లును తెచ్చినప్పుడు తాము నిర్ద్వంద్వంగా వ్యతిరేకించామని, తమ పార్టీ వైఖరి తెలిపామని టీఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ సభ్యుడు నామానాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం న్యూదిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ ఇద్దరు నాయకులు పాల్గొని వివిధాంశాలపైన టీఆర్‌ఎస్‌ ‌వైఖరిని తెలియచేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. నేషనల్‌ ‌పాపులేషన్‌ ‌రిజిస్ట్రేషన్‌ను (ఎన్‌పీఆర్‌) ‌నేషనల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ‌సిటిజన్‌షిప్‌(ఎన్‌ఆర్‌సీ)లను తమ పార్టీ ఆమోదించడం లేదన్న విషయాలను అఖిలపక్షసమావేశంలో స్పష్టం చేశామని నామా పేర్కొన్నారు. సీఏఏ బిల్లులో ఎన్‌పీఆర్‌ ‌ప్రస్తావన కూడా ఉన్నందున వీటన్నింటినీ తాము విశ్లేషించామని, తాము ఆమోదించేదిలేదని నిర్ణయించామని, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చెప్పిన వివరాల ప్రకారం అఖిలపక్ష సమావేశంలో పార్టీ వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పామని నామా తెలిపారు.

సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేస్తామని తెలిపారు. కాశ్మీర్‌ ‌దేశంలో అంతర్భాగమన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని దేశప్రజలందరూ కాశ్మీర్‌లో 370ని రద్దుచేయడం సమర్ధించినందున, ఈ అంశం దేశసమగ్రతతో ముడిపడి ఉన్నందున రద్దును సమర్థించామని కేశవరావు పేర్కొన్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న విభజనాంశాలన్నింటినీ ప్రస్తావించామని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ ‌విషయంలో చొరవచూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మిషన్‌భగీరథకు నీతిఅయోగ్‌ ‌సిఫారసు చేసినట్లు 19వేల కోట్లు ఇవ్వాలని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చే రూ400 కోట్లను ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని కే.కే. తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.