Take a fresh look at your lifestyle.

చెత్త నుంచి విద్యుత్‌తో.. దుర్గంధం నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నగర చరిత్రలో మరో కలికితురాయి చేరింది. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ‌మంగళవారం ప్రారంభమయింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి ప్లాంట్‌ ఇదే. జవహర్‌నగర్‌లోని ఈ ప్లాంట్‌ ‌మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభం కాగా, మునిసిపల్‌ ‌మంత్రి కెటిఆర్‌ ‌లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. జవహర్‌ ‌నగర్‌, ‌దమ్మాయిగూడ ప్రజలకు దుర్గంధం నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు వేస్ట్ ‌టూ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. నగరంలోని జవహర్‌నగర్‌లో జీహెచ్‌ఎం‌సీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ ‌సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్‌ ‌వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు.

19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. విద్యుత్‌ ‌ప్లాంట్‌ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నగరంలో ప్రతి రోజు 5వేల నుంచి 6 వేల టన్నుల చెత్తను సేకరించి..దాన్ని జవహర్‌నగర్‌లో డంపింగ్‌ ‌యార్డు ఏర్పాటు చేశారు. దీనివల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, ఈ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ ‌కృషి చేశారని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply