Take a fresh look at your lifestyle.

ఏ‌ప్రిల్‌ 1‌నుంచి నిరవధికంగా..? నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

From April 1 Today, the bank employees strike tomorrow

ప్రజాతంత్రప్రతినిధి, హైదరాబాద్‌: ఏ‌ప్రిల్‌నుంచి నిరవధిక సమ్మె చేస్తామని అఖిలభారతస్థాయిలోని బ్యాంకు ఉద్యోగుల సంఘాలన్నీ గురువారం తమ కార్యాచరణను ప్రకటించాయి. రెండేళ్లుగా వేతనాలను సవరించాలని, 20శాతానికి మర వేతనాలను సవరించాలనే ప్రధానడిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలను ప్రారంభించారు. ముంబైలో అఖిలభారతస్థాయిలోని ఏఐబిఈఏ, యునైటెడ్‌ ‌ఫోరమ్‌ ఆఫ్‌ ‌బ్యాంక్‌ ‌యూనియన్స్ ‌వంటి సంస్థలు జరిగిన చర్చచలో పాల్గొన్నాయి, బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌లపైన యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోవడంతో ఇదివరలో ఇచ్చిన పిలుపు్ప పకారం జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో సమ్మె ఉంటుందని తెలంగాణ ఎస్‌బీఐ యూనియన్‌ ‌నాయకులు చుక్కయ్య, తెలంగాణ ఆంధ్రాబ్యాంక్‌ అసోసియేషన్‌ ‌నాయకులు జి. బక్కయ్య పేర్కొన్నారు ముంబైలో జరిగిన చర్చలలో కేంద్ర కార్మికశాఖ కమిషనర్‌ ‌రాజన్‌వర్మ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు.31, 1 వ తేదీలలో, తర్వాత ఏప్రిల్‌ ‌నుంచి నిరవధిక సమ్మెలో 10లక్షల బ్యాంకుల ఉద్యోగులు పాల్గొంటారని ఏఐబిఈఏ జాతీయ అధ్యక్షులు సిహెచ్‌ ‌వెంకటాచలం పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనాలని బ్యాంకుల అసోసియేషన్‌ ‌నాయకులు పిలుపు నిచ్చారు. యాజమాన్యంతో మరోసారి చర్చలు జరిపుతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరానట్లయితే మార్చి11నుంచి మూడురోజుల పాటు నిరవధికసమ్మె చేస్తామని కార్యాచరణలో తెలిపారు. కేంద్రం చర్చలకు పిలువని పక్షంలో, ఏప్రిల్‌ ‌నుంచి నిరవధిక సమ్మె చేస్తామని భ్యాంకు సంఘాలన్నీ హెచ్చరించాయి.

బ్యాంకుల ఉద్యోగులందరికీ 20శాతం మేరకు వేతనాలను సవరిచాలనే ప్రధాన డిమాండ్‌పైన చర్చలు విఫలమైనందున అనివార్యంగా నేడు రేపు నిరవధిక సమ్మె చేస్తున్నామని తెలంగాణ నాయకులు పేర్కొన్నారు.వేతన సవరణలో పాటు, ఐదురోజులపాటు పనిదినాలు ఉండాలని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్నీ సంస్థలలో, ఐ.టిలో ఐదురోజుల పనివిధానం ఉన్నదని వారు తెలిపారు.స్పెషల్‌ అలవెన్సులను బేసిక్‌పేతో కలుపాలని , ఫ్యామిలీ పెన్షన్‌ను కూడా • సవరించలదేని, వెంటనే ఫ్యామిటీ పెన్షన్‌ను 15శాతానికి పెంచాలని సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. పెన్షన్లను సవరించాలని, ఉద్యోగుల సంక్షేమనిధిని పెంచాలని,ఒకేతీరు పనిగంటలు ఉండాలని,నేషనల్‌ ‌పెన్షన్‌స్కీంను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

Tags: From April 1, Today, the bank employees, strike tomorrow

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply