Take a fresh look at your lifestyle.

‌ప్రకృతితో మిత్రత్వం!

జీవన యానంలో
తారస పడుతున్న సహచరులు
సమాజ మనుగడలో
సాగిపోతున్న పడవ ప్రయాణం
ఆకాశంలో అవకాశం కోసం
మేఘాల ఎదురుచూపులు
తబ్బిబ్బవుతున్న మబ్బులు
ఘర్షణ సంఘర్షణల నడుమ
పెళపెళమంటూ
ఉరుముల మెరుపులు
వర్షంతో
దాహం తీర్చుకున్న భూమాత
ఆగ్రహంతో
ఉగ్ర రూపమై
వడివడిగా పిడుగులు
చల్లని ఒడిలోకి
జారవిడుచుకున్న నేలతల్లి
ప్రశాంత వదనంతో ఇంద్ర ధనస్సు
కాల చక్రంలో రుతువుల పయనం
సృష్టికి ప్రతి సృష్టిలో
ప్రకృతితో మరపురాని మిత్రత్వం
హితం కోరుకుంటున్న స్నేహితం
ఆపదలో ఆప్తులైన మిత్రులు
జీవితంలో చెరిగిపోని చిన్న నాటి బాల్యం!
– కట్టెకోల చిన నరసయ్య,
7981814784

Leave a Reply